Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

RDO: కోదాడ ఎస్సీ బాలుర హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డిఓ

*ఆర్డీవో నేలపై కూర్చొని హాస్టల్ తనిఖీలు
*హాస్టల్ లో సదుపాయాల పట్ల ఆగ్రహం వ్యక్తం

RDO: ప్రజా దీవెన, కోదాడ: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో (Government Welfare Hostels)విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా వార్డెన్ లు చర్యలు తీసుకోవాలని కోదాడ ప్రత్యేక అధికారి, ఆర్డిఓ సిహెచ్ సూర్య నారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోదాడ పట్టణం లోని హుజూర్ నగర్ రోడ్డు లో గల బాలుర ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ (Random check)చేసారు.

హాస్టల్ పరిసరాలు,విద్యార్థులు వుండే గదులు,డైనింగ్ హాల్,వంటగది (Rooms, dining hall, kitchen)స్టోర్ రూమ్ పరిశీలించారు. పరిసరాలు డైనింగ్ రూమ్,విద్యార్థుల గదుల్లో అపరిశుభ్రత గమనించి వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం హాస్టల్ లో నేల పై కూర్చొని విద్యార్థులతో మాట్లాడారు. భోజనం మెనూ ప్రకారం గా వడ్డీసున్నారా అని విద్యార్థులను అడగ్గా విద్యార్థులు భోజనం సరిగా లేదని చెప్పారు.అనంతరం డైనింగ్ హాల్,స్టడీ రూమ్ లు,భోజనం తదితర అంశాలపై సూచనలు చేసారు.మళ్ళీ తనీఖీ కి వచ్చే వరకు మెరుగు పరుచుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట డిటీ అనీల్ కుమార్,సిసి విక్రమ్, వార్డెన్ వెంకట్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.