RDO Suryanarayana: ప్రజా దీవెన, కోదాడ,సంత్ సేవాలాల్ మహారాజ్ స్పూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ లు పేర్కొన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ నియోజకవర్గ కన్వీనర్ బానోత్ బాబు నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గిరిజన జాతి అభివృద్ధి కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని ఆయన జీవిత చరిత్రను భావి తరాలకు తెలియచెప్పాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు.
మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకువెళ్లి సేవాలాల్ మహారాజ్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల,కళాశాల విద్యార్థులు బంజారా పాటలకు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆట, పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, సుధీర్, డాక్టర్ దశరధ నాయక్, ఎమ్మార్వోలు హిమబిందు, సరిత, వాజీద్, ఎండిఓ రామచంద్రరావు, కమిటీ అధ్యక్షులు బానోతు బాబు నాయక్, ఉపాధ్యక్షులు భూక్య రవి నాయక్, మాలోత్ సైదా నాయక్, బర్మావత్ రాజు నాయక్, బానోతు నందాలల్ నాయక్, హాజీ నాయక్, హనుమాన్ నాయక్, రాము నాయక్,భవ సింగ్, రఘు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
