Registration Offices: రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సరికొత్త సొగసులు
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులలో ప్రధాన భూమిక పోషించే రిజిస్ట్రేషన్ల శాఖకు సరికొత్త సొగసులు ఆద్దేoదుకు రేవంత్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రదీప్ రెడ్డి కార్యాలయాలు వచ్చే వాళ్లు కూర్చోడానికి కుర్చీలు లేకుం డా చెట్ల కింద, నీడ దొరికిన చోట నిరీక్షించే పరిస్థితి ఇకపై ఉండకూ డదని సీఎం రేవంత్ రెడ్డి అధికారు లతో అన్నారు.
కార్పొరేట్ స్ధాయిలో అధునాతన భవనాలు
ఆదర్శవంతంగా ఆహ్లాదంగా కార్యాలయాల పరిసరాలు
మోడల్‌గా ఉండాలని సీఎం రేవంత్ నిర్ణయం
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులలో ప్రధాన భూమిక పోషించే రిజిస్ట్రేషన్ల శాఖకు (Registration Offices)సరికొత్త సొగసులు ఆద్దేoదుకు రేవంత్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రదీప్ రెడ్డి కార్యాలయాలు వచ్చే వాళ్లు కూర్చోడానికి కుర్చీలు లేకుం డా చెట్ల కింద, నీడ దొరికిన చోట నిరీక్షించే పరిస్థితి ఇకపై ఉండకూ డదని సీఎం రేవంత్ రెడ్డి అధికారు లతో అన్నారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులుగా( corporate level buildings ) తీర్చిది ద్దాలని ఆదేశించారు. సోమవారం అధికారులతో జరిగిన సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రం లో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. (Registration Offices)వీటిలో 38 ఆఫీసులు మాత్రమే సొంత భవ నాల్లో ఉన్నాయి. ఆదిలాబాద్ లో బోథ్, మేడ్చల్ జిల్లా షామీర్ పేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఎన్నికల కోడ్ తర్వాత ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.ఇక మిగతా 104 ఆఫీసు లు అద్దె భవనాల్లోనే కొనసాగుతు న్నాయి. 52చోట్ల ఆఫీసులకు అవ సరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూమి కూడా కేటాయిం చారు. భూములు రెడీగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించా లని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మిగతా 52 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లకు(Registration Offices) సరిపడే స్థలాలను అన్వేషించా లని, పబ్లిక్ యుటిలిటీ కింద సేకరించిన స్థలాలు అందుబాటులో ఉంటే.. అక్కడే నిర్మాణాలు చేపట్టా లని సూచించారు. కాగా, మొదటి దశలో ఆదాయం ఎక్కువగా తెచ్చిపెడుతున్న రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వచ్చే క్రయ విక్రయదారులు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసేంత సేపు మంచి ఆతిథ్యమిచ్చే, ఆహ్లదంగా ఉండే కార్పొరేట్ లుక్, వెయిటింగ్ హాల్, డ్రింకింగ్ వాటర్, కెఫేటెరియా లాంటి అన్ని సదుపాయాలుండా లని, అవన్నీ ఉండేలా అధునాతన నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించారు. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే చోట సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాల ఆఫీసుల నుంచి ఎక్కువ పని ఉన్న చోటికి సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆదేశించారు.
టీజీ లోగో పై రుద్ర రాజేష్ తో రేవంత్ చర్చలు …
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు నమూనాలను పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చారు. టీఎస్ స్థానంలో టీజీని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర అధికారిక కమ్యూనికేషన్‌లు కూడా టీఎస్‌కు బదులుగా తెలంగాణ కోడ్‌ను టీజీగా ఉపయోగిస్తు న్నాయి. లెటర్‌హెడ్‌ల నివేదికలు, నోటిఫికేషన్‌లు, అధికారిక వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ బయోస్, ఇతర అధికారిక వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ బయోస్‌లో టీజీ గా మార్చేశారు. మొత్తానికి జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర దినోత్సవం ను అంగరంగ వైభవంగా నిర్వహించినందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తులో తల మునకలై ఉంది.
Registration Offices change colour full