Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Metallurgy Book :నాంపల్లిలో లోహ విజ్ఞాన౦పై అ ద్భుత గ్రంధo ఆవిష్కరణ

Metallurgy Book : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచం లో అత్యంత నాణ్యమైన కత్తుల త యారీకి ప్రధాన కేంద్రం డమాస్కస్. అయితే ఈ కత్తుల తయారీకి తె లంగాణలో ఉత్పత్తయ్యే ఉక్కును డమాస్కస్ దిగుమతి చేసుకునేది. పైగా ఒక ముద్ద ఉక్కు కు పది రేట్ల బంగారు ముద్దలను మన తెలంగా ణా ఉక్కు తయారీ దారులకు అంద చేసే వారట. ఆరువేల సంవత్సరాల కు పూర్వమే తెలంగాణలో ప్రపం చంలోనే అత్యంత మేలు రకమైన ఉక్కు తయారీ కావడంతో పాటు ప్ర పంచంలోని పలు దేశాలకు ఎగుమ తి చేసేవారట తదితర ఈ అంశాల తో పాటు ఎంతో విలువైన సమాచా రాన్ని అందించిన Wootz The Fo rgotten Metal Craft of Dec can అనే గ్రంధంలో డాక్టర్ శ్రీపెరుం దురు జైశంకర్ పేర్కొన్నారు. శ్రీ పె రుందురు జైశంకర్ రాసిన ఈ పుస్త కావిషకరణ నాంపల్లి లోని తెలుగు విశ్వ విద్యాలయం ఆడిటోరియం లో గురువారం జరిగింది. జాతీయ విశ్వకర్మ ఎంప్లాయిస్, ప్రొఫెషనల్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగి న ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమా నికి ఎమ్మెల్సీలు సిరికొండ మధు సూదనాచారి, దాసోజు శ్రవణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యా రు.

అసోషియేషన్ జాతీయ అధ్యక్షు లు ఏ. పద్మాచారి అధ్యక్షతన జరి గిన ఈ పుస్తక ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మా ట్లాడుతూ, తెలంగాణా కేవలం సాం స్కృతికంగా, చారిత్రకంగా ఉన్నత చరిత్ర కలిగిన తెలంగాణలో అత్యం త నాణ్యమైన ఉక్కు లోహం కూడా ఉత్పత్తి చేసేదని ఆధారాలతో సహా రూపొందించిన ఈ పుస్తకం మంచి పరిశోధనా గ్రంధం గా ఉపయోగ పడుతుందన్నారు.

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడు తూ ప్రస్తుత నిచ్చెనమెట్ల సమాజం లో అద్భుత కళాకారులుగా, నిర్మా ణ ప్రతిభ వున్నా విశ్వబ్రాహ్మలు శూ ద్రులుగా విభజించబడి అణగారిన కులాలుగా మారారని ఆవేదన వ్య క్తం చేశారు. సమాజానికి నాగరికత నేర్పిన విశ్వ బ్రాహ్మణుల గొప్పత నంపై ఈ గ్రంధంలో అద్భుతంగా పే ర్కొన్నారని అన్నారు. గ్రంథ రచయి త శ్రీపెరంబుదూరు జైకిసాన్ తెలం గాణాలో ఉక్కు లోహ పరిశ్రమ పరి ణామంపై వివరించారు. ఆంగ్లంలో Wootz అని పిలిచే ఉక్కును భార త దేశంలో అత్యంత పదునైన ఆ యుధాలు తయారు చేయడానికి ఉపయోగించేవారు. ఈలోహం అ ధిక కర్బనం కలిగిఉంటుంది. ఇది, ఇనుములాగా మెత్తనైనా లోహం కాదు. ఇనుప ముక్కలను అతి ఉ ష్టోగ్రత దగ్గర కరిగించి కర్బనం జో డించి ఉక్కుగా తయారు చేస్తారు. దీనితోనే కత్తులు, చాకులు, పదు నైన ఆయుధాల తయారీకి ఉప యోగించేవారు. ఈ ఉక్కును గుజ రాత్ లోని క్యాచ్ ఓడరేవుద్వారా పర్షియన్ జలసంధి మీదుగా డమా స్కస్ కు రవాణా చేయబడి సిరి యాలో ఆయుధాలు తయారు చేసే వారన్నారు.

కచ్ మీదుగా ఎగుమతి చేసినం దున ఈ లోహాన్ని కచ్చి లోగా పిలి చే వారట. 1750 లో డమాస్కస్ లో మన లోహంతో కత్తులు, ఆయు ధాల తయారీ నిలిచిపోయిందని ఈ గ్రంధంలో సవివరంగా తెలిపా రు. మహమ్మద్ ప్రవక్త వాడిన ఖ డ్గాన్ని ‘మొహాన్నద్’ అని పిలిచేవా రు. మొహాన్నది అంటే మంచి భార తదేశం ఉక్కుతో తయారుచేసిన ఖడ్గమని అర్ధం. ఇక, మనదేశంలో గుప్తుల కాలం క్రీ.శ. 400 లో నిర్మిం చిన ఢిల్లీ ఇనుప స్తంభం, ఒర్రిస్సా లోని కోణార్క్ దేవాలయం లో సు మారు 50 నుండి 60 టన్నుల బ రువైన దాదాపు 60 ఇనుప స్తంబా లు, ఇప్పటికీ కానవచ్చే ఎన్నో ఫిరం గులు తుప్పుపట్టకుండా ఉంది మ న పూర్వీకుల లోహ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు.

*Wootz The Forgotten Metal Craft of Deccan అనే ఈ పుస్త కంలో మొదటి అధ్యాయంలో తెలం గాణ సంక్షిప్త చరిత్ర, ఈ ప్రాంతంలో ని ఉక్కు భౌతిక సంస్కృతీ, వివిధ ప్రాంతాల్లో తుప్పుపట్టని ఉక్కు స్తం బాలు, ఫిరంగులు, విశ్వా కర్మల వృ త్తి నైపుణ్యం తదితర అంశాల గు రించి వివరించారు. రెండు అధ్యా యంలో తెలంగాణాలో పెద్ద రాతి సమాధుల యుగంగురించి, క్రీ.పూ. 6 వేలసంవత్సరాల నాడు ఇక్కడ కనిపించే ఇనుప సంస్కృతిని వివ రించారు. మూడవ అధ్యాయంలో తెలంగాణలో అధికంగా ఉక్కు ఆ ధారిత వస్తువులు తయారయ్యే గ్రా మాలు, చిన్న పట్టణాల గురించి వి వరించారు. కర్ణాటక, తమిళ నాడు, తెలంగాణా లో ఉక్కు తయారీలో తేడాలున్నాయని, తెలంగాణలో ఉక్కు తయారీలో ఉక్కు ముద్దలకు 1 % నుండి 2 % కార్బనం కలిపేవా రు. ఇతర రాష్ట్రాలల్లో ఇది, 0 .8 % నుండి 1 .2 % కర్బనం కలిపే వారు. అందుకే, తెలంగాణా ఉక్కు అత్యం త ప్రామాణికమైనదని వివరించా రు.

తెలంగాణా లో ఉక్కు లోహానికి సం బందించిన అనేక అంశాలను తెలి య చేసే ఈ పుస్తకం మెటల్స్ పై ప రిశోధన చేసే స్కాలర్స్ కు, పోటీ ప రీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు.ఈ పుస్తకావిష్కరణ కా ర్యక్రమంలో రాష్ట్ర విశ్వ భ్రమణ సం గం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ, హైదరాబాద్ డీఆర్ఓ వెంక టా చారి, రాజేందర్ రెడ్డి, వి. రఘు నాధ్, రఘువీర్ ప్రతాప్, పెందోట శ్రీ ను, తంగెళ్ల పల్లి రవికుమార్, కిరణ్ కుమార్, బుద్దారం సుధాకర్, శాంతి కృష్ణ, మంజుల, తదితరులు పాల్గొ న్నారు.