బిగ్ బ్రేకింగ్, సత్తుపల్లి సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్
Remondprisoner: ప్రజా దీవెన, సత్తుపల్లి: సత్తుపల్లి సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదు పరారయ్యాడు. జైలు సిబ్బంది కళ్ళు కప్పి తప్పించుకున్నాడు. సబ్ జైలు సూపరింటెండెంట్ సోమరాజు ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం అశ్వారావు పేట మండలం ఆసు పాకకు చెందిన పెండ్ర రమేష్ అతని భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు.
కేసు నమోదవ్వగా రిమాండ్ ఖైదీగా సత్తుపల్లి సబ్ జైలు కి గతనెల 3వ తేదీన వచ్చాడు. కాగా 18అడుగుల గోడపై నుంచి దూకి వెను కనున్న ఫారెస్ట్ అర్బన్ పార్కులో కి పరారయ్యాడు. సత్తుపల్లి పట్టణ సీఐ టీ.కిరణ్ ఆధ్వర్యంలో రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నా యి. కాగా ఇదే విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీకి సమాచారం ఇచ్చామ ని సబ్ జైలర్ తెలిపారు.