**రోడ్లకు ఇరువైపుల విద్యుత్ కాంట్రాక్ట్ చెట్లు తొలగింపు..
** ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఉన్నట్టా..లేనట్టా ..
** కనగల్ మోడల్ స్కూల్ పిల్లలకు నీడ లేక ఇబ్బందులు..
electricity contract : ప్రజా దీవెన , కనగల్ : మండలంలోని రంగారెడ్డి బంగ్లా రైతన్న కాంట సమీపంలో ప్రధాన రహదారి పొడవున రోడ్డు కిరువైపులా చెట్లను విద్యుత్ కాంట్రాక్టర్లు ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేకుండా చెట్లను నరికి వాల్టా చట్టానికి తోట్లు పొడుస్తున్నారు ఇప్పటికి వాతావరణంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఎన్నో రోగాలు బారిన పడుతున్నారు రెండు ముక్కలు నాటి అవసరం మేరకు ఒక చెట్టు నరికి విధంగా చూడాలని అలా కాకుండా ఏకంగా కిలోమీటర్లు నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లు మిషన్లతో విద్యుత్ కాంటాక్ట్ మరియు అధికారులు నరికేయడం ప్రయాణికులకు పాదాచారులు నానా అవస్థలు పడుతున్నారు ఆదర్శ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు బస్ స్టేషన్ లాగా నీడగా చెట్లు ఉండడంతో విద్యార్థులకు నీడ లేకుండా నరికి వేస్తున్నారని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు.
వేసవికాలంలో ఎండలో త్రీవతగా ఉంటాయని వాతావరణం నిప్పులు చెబుతున్నారు అయితే నీడనిచ్చే ఈ చెట్లను నరికి వేయడంతో ప్రయాణికులకు నిలువున నీడ లేక ఎండలోనే ముంగిపోతున్నారు విద్యుత్ కాంటాక్ట్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
* * రోడ్డుకు ఇరువైపులా ప్రయాణికులకు..నీడ లేకుండా చేస్తున్నారు**
ఎం పురుషోత్తం రెడ్డి, (లచ్చగూడెం)
కాంట్రాక్టర్ సంబంధించిన సిబ్బందిని అడిగితే మాకు అధికారులు చెప్పారు మేము నరికేస్తాం అని అంటున్నారు స్తంభాలు పాతేటప్పుడు ఏం చేశారు ఇప్పుడు అడుగుతున్నారు ఏంది, మేము ఎవరు చెప్పినా వినం అని దృశ్యగా సమాధానం చెబుతున్నారు. చెట్లు పెంచడం ఎందుకు నరకడం ఎందుకు. రోడ్డుకు 50 ఫీట్ల దూరంలో విద్యుత్ స్తంభాలు ఉండాలి కానీ ఇక్కడ విద్యుత్ కాంట్రాక్టు రోడ్డుకు దగ్గరలో స్తంభాలు పాతుతున్నారు .
మానవాళి మనగడ పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా విరివిగా మొక్కలు నాటే చెట్లుగా పెంచడానికి గత ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి హరితహారం పథకం అమలు చేసింది రహదారుల పక్కన పెంచడం వలన బాటసారులకు నీడ చూడడానికి ముచ్చటగా ఉంటుందని ఉద్దేశంతో ఎక్కువగా మొక్కలు నాటడం జరిగింది కనగల్ దేవరకొండ రహదారిపై పెద్ద సంఖ్యలో చెట్లు నాటారు చెట్లు ఏపుగా పెరుగుతుంటే కరెంట్ తీగలకు అడ్డు వస్తున్నాయని ఎప్పటికప్పుడు విద్యుత్ కాంటాక్ట్ అధికారులు చెట్టు కొమ్మలు నరికించి మొక్కల ఎదుగుదలను అడ్డుకుంటున్నారు చెట్లు నరకకుండా బాటసారులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు