Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో (Government Order)పై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి అందజేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) అధ్యక్షతన సభ్యులుగా మంత్రులు డి. శ్రీధర్ బాబు(Shridhar Babu), పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar Goud) లు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిష్ణాతులైన మేధావులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఆయా చర్చల్లో ఉద్యోగుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ ను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి రూపొందించిన తుది నివేదిక పత్రాలను సీల్డ్ కవర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు.