Republic Day : ప్రజా దీవెన,కోదాడ:భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదివారం కోదాడ బాప్టిస్ట్ చర్చి పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పాస్టర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ సారధ్యంలో రచించిన భారత రాజ్యాంగం జనవరి 26వ 1950 నుంచి అమల్లోకి వచ్చిందని వాటి ఫలాలను దేశ ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం న్యాయ వ్యవస్థను పూర్తిస్థాయిలో అనుభవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
రాజ్యాంగం అమలైన రోజున గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు నియోజకవర్గ పరిధిలో ఉన్న క్రైస్తవులకు పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో
కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు ఒంటెపాక జానకి ఏసయ్య, బొల్లికొండ కోటయ్య విజయానంద్ మోసెస్, రాంబాబు, మేరీ ,నందరాజు శారా, కవిత భాగ్యశ్రీ ,సీత తదితరులు పాల్గొన్నారు.