Republic Day : ప్రజా దీవెన,కోదాడ:కోదాడ 76వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కాలనీ లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ నాయకులు బెజవాడ శ్రవణ్ మరియు ఎల్ఐసి రీజినల్ మేనేజర్ రణపంగు ప్రవీణ్ కుమార్ అడ్వకేట నవీన్ , పాల్గొని విద్యార్థులకు అందజేశారుఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ మాట్లాడుతూ.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి వల్లనే ఈరోజు భారతీయులందరూ సుఖంగా సంతోషలతో జీవిస్తున్నారంటె బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే కారణమని కొనియాడారు, పాఠశాలలో చదువుకునే విద్యార్థులంతా కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు పరీక్షా సామాగ్రిలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని తెలిపారు అనంతరం
ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణారావు ఉపాధ్యాయులు విద్యార్థులు అంబేద్కర్ కాలనీ ప్రజలు , పూలమాలలు,బొక్కేలతో ముఖ్య అతిథులను సత్కరించారు