Republic Day : ప్రజా దీవెన నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవ వేడు కలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వ హించిన వేడుకల్లో భాగంగా జాతీ య జెండాను నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులిమామిడి మహేం దర్ రెడ్డి ఆవిష్కరించారు.
జాతీయ గీతాలాపన అనంతరం జర్నలిస్టులందరికీ నల్లగొండ ప్రెస్ క్లబ్ తరఫున ఆయన కార్యదర్శి గాదె రమేష్, కోశాధికారి దండంప ల్లి రవికుమార్ లతో కలిసి గణతం త్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు లందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తదననంతరం కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులకు మిఠాయిలు పంపిణీ చేసి అల్పాహార, తేనిటి విందు కూడా ఏర్పాటు జరిగింది.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ గణతంత్ర దినోత్స వాన్ని పురస్కరించుకొని జిల్లా కేం ద్రంలోని జర్నలిస్టులకు రెండు రో జులపాటు నిర్వహించిన క్రీడా పోటీ ల్లో విజేతలకు అదే విధంగా రన్న రప్ లకు బహుమతుల ప్రధానం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చే తుల మీదుగా పంపిణీ కార్యక్రమా న్ని త్వరలో తలపెడుతామని వెల్ల డించారు. అదే విధంగా నల్లగొండ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఐకాన్ ఆ సుపత్రి సౌజన్యంతో సిద్ధం చేసి ఒకే వేదికపై క్రీడా బహుమతులు, హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అట్ట హాసంగా చేపడుతామని తెలి పా రు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సలహాదారు గుండగోని జయ శంకర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరెడ్డి, సల్వాది జానయ్య, ఎన్నమల్ల ర మేష్ బాబు, షరీఫ్, జానీ బాయ్, వెంకట మధు, నరేందర్, కత్తుల హరి, కత్తుల యాదగిరి, పెద్దగోని మధు, గిరి, చంద్రశేఖర్, సందీప్, వాడపల్లి మధు, సతీష్, యాదగిరి జనార్ధన్, సాయి, ముచ్చర్ల విజ య్, ముచ్చర్ల శ్రీనివాస్, ఆసిఫ్, స్వామి, రాజు, ఏం సతీష్ , తది తరులు పాల్గొన్నారు.