Republic Day : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బందికి, జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో యస్. బి డి.ఎస్పి రమేష్,నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, డిసియర్బి డీఎస్పీ సైదా, డిటీసీ డీఎస్పీ విఠల్ రెడ్డి,ఏ.ఓ శ్రీనివాస్, సిఐలు రాఘవరావు,రాజశేఖర్ రెడ్డి, శివ శంకర్,శ్రీను నాయక్, మహాలక్షమయ్య, ఆర్.ఐలు సంతోష్,శ్రీనివాస్, సూరప్పా నాయుడు,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సోమయ్య ,ఐటీ, డిసి ఆర్బి, ఎస్బి, విభాగాల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.