Republic Day : ప్రజా దీవెన, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన సుమారు 250 మంది ఉద్యోగులను ఎంపిక చేశారు.ఐతే ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఉద్యోగికి స్వయంగా అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందించడం ఆనవాయితీ కానీ తూతూ మంత్రంగా కొంత మందికి ప్రశంసాపత్రాలు ఇచ్చి మిగతావి ఖాళీ కుర్చీల మీద పడేశారు.
అతిధులు వెళ్ళిపోయాక ఉద్యోగులు తమ ప్రశంసాపత్రాలను వెతుక్కొని తీసుకున్నారు తమ సేవలకు జిల్లా నాయకులు, అధికారులు ఇచ్చిన గౌరవ, మర్యాదలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు