డాక్టర్ రామకృష్ణకు ఉత్తమ అవార్డు..
Republic Day : ప్రజా దీవెన /కనగల్: మండలంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు 76వ భారత రాజ్యాంగం గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర విద్యా మందిర్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరకింతం కావాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగంలోని విలువలు అక్కల కోసం పాటుపాడాలన్నారు స్వతంత్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం అహింస శాంతి సంఘీభావం సార్వత్రిక సౌభౌతిత్వం గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు.
ప్రభుత్వ కార్యాలయంలో తాసిల్దార్ కార్యాలయం పై తాసిల్దార్ పద్మ, విద్యుత్ కార్యాలయంలో ఆర్ ఎన్ కుమార్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై విష్ణుమూర్తి, ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ రామకృష్ణ, మహిళా సంఘం భవనం లో ఏపిఎం హరి బాబు, పి ,ఎస్ ,ఎస్, సి ,చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్ బల్గూరి వెంకన్న గౌడ్, వివిధ ప్రభుత్వ పాఠశాలలో తదితర గ్రామాలలో ఘనంగా జండా ఎగరవేశారు.