Republic Day : ప్రజా దీవెన,కోదాడ: రిపబ్లిక్ డే జనవరి 26 సందర్భంగా జిల్లా పరిషత్ బాలురావు ఉన్నత పాఠశాల లో జనవరి 24 ,25 తేదీలలో విద్యార్థులకు క్రీడలు ఆటలు పోటీలో నిర్వహిస్తున్నట్లు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ తెలియజేశారు. ఆటల పోటీలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు ఆటలు క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, విద్యార్థుల మధ్య సమిష్టి తత్వం ఏర్పడుతుందని తెలిపారు .
విద్యార్థులకు జూనియర్ సీనియర్ విభాగాలలో బాలబాలికలకు వేరువేరుగా కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్, కోకో, షటిల్, కుర్చీలు ఆట, కుంటు డు, తాడా ట, రన్నింగ్, లాంగ్ జంప్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు జనవరి 26 న ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటల పోటీల నిర్వహణలో పి ఈ టి లు బాలస్వామి, నరసమ్మ , పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.