*రెస్క్యూ ఆపరేషన్ చేసిన పోలీస్..
*జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్..
Rescue operation: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ మండల పరిధిలోని నల్లబండగుడెం గ్రామ శివారులో పాలేరు బ్యాక్ వాటర్ (Backwater) లో చిక్కుకున్న గుడివాడకు చెంది 6 గురు కూలీలు ముగ్గురు ఆడవారు, ఒక చిన్నాపాప, ఇద్దరు మగవాళ్ళను పోలీసు, కోదాడ మత్యుకార్మికుల సహాయంతో సురక్షితంగా రక్షించారు. కూలీలు (labors)పని చేస్తున్న కోళ్ల ఫామ్ షేడ్ లోకి పాలేరు బ్యాక్ వాటర్ రావడంతో ప్రమాదంలో చిక్కుకున్న కూలీలను పోలీసుల సహాయంతో సురక్షితంగా బయటపడ్డా (Get out safely) సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డ కూలీలు పోలీసుల కు , గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపినారు. 6గురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు,
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, DSP శ్రీధర్ రెడ్డి, కోదాడ రూరల్ CI రజిత రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, స్థానిక SI అనిల్, గ్రామస్తులు, కోదాడ మత్స్యకార్మిక సంఘం సభ్యులు వీరాస్వామి, గురుస్వామి, వేలాద్రిల పోలీసు సిబ్బంది ఉన్నారు.