Vempati SC Colony : ఇంటింటికి నల్లాలు లేక ఇబ్బంది పడుతున్న వెంపటి ఎస్సీ కొత్త కాలనీ వాసులు

డ్రైనేజీలో బిందెలు ఉంచి నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి Vempati SC Colony : ప్రజా దీవెన... తుంగతుర్తి... : మండల పరిధిలోని వెంపటి గ్రామంలో ఎస్సీ కొత్త కాలనీకి మంచినీటి సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ఇంటింటికి నల్లాలు అనే కార్యక్రమంలో ఎస్సీ కాలనీలో నల్లాలు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడక్కడ ఉన్న నల్లాల వద్ద నీళ్లు పట్టుకోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. డ్రైనేజీ కాల్వల్లో మురుగునీరు ప్రవహిస్తుండగా అదే కాలువలో బిందెలు పెట్టి...