–న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షలు మాతంగి వీరబాబు
Employee Issues : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డి. లక్ష్మారెడ్డి కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాతంగి వీరబాబు మాట్లాడుతూ న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడమే మా మొదటి ఎజెండాగా ముందుకు వెళతానని తెలిపారు. అదేవిధంగా న్యాయశాఖ ఉద్యోగికి ఏ కష్టం వచ్చినా తాను తన కార్యవర్గ సభ్యులు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ప్రమాణ స్వీకారం అనంతరం న్యాయశాఖ ఉద్యోగులు టీఎన్జీవో సంఘం నాయకులు, పోలీస్ యాదవ సంఘం నాయకులు, ఎం వి ఎఫ్ సంఘం నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు మాతంగి వీరబాబుని, జనరల్ సెక్రెటరీ ఎండి లతీఫ్, కార్యనిర్వాహన కార్యదర్శి వంశీకృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాంబాబు, జంగయ్య, ఉషారాణి జాయింట్ సెక్రెటరీలు తిరుమలేష్, సుజాత, రాములును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అఖిలభారత న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బి. లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఎస్వీ సుబ్బయ్య, వివి రమణారావు, ఉపాధ్యక్షులు వెంకట రెడ్డి, టీఎన్జీవో అధ్యక్షులు మురళి పాల్గొన్నారు.