Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishan Reddy: సన్న వడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు

తెలంగా ణలో వరి పంటకు బోనస్ అని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకే రూ.500 బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతోందని కేంద్ర మంత్రి , బిజెపి రాష్ట్ర అధ్యక్షు డు కిషన్ రెడ్డి మండిపడ్డారు.

రైతులను మరోమారు రేవంత్ ప్రభుత్వం మోసగించింది
రైతు రుణమాఫీ, బోనస్ ల విష యంలో ఇప్పటికీ దగా చేస్తోంది
మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో వరి పంటకు బోనస్ అని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సన్న వడ్లకే రూ.500 బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతోందని కేంద్ర మంత్రి , బిజెపి రాష్ట్ర అధ్యక్షు డు కిషన్ రెడ్డి(Central minister Kishan reddy ) మండిపడ్డారు.రాష్ట్రంలో సన్న వరి తక్కువ మంది రైతులు వేస్తార న్నారు. యాసంగిలో 90 శాతం దొడ్డు రకం ధాన్యమే రైతులు పండి స్తారన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ఇప్పుడేమో ఆగస్టు 15 లోగా చేస్తా మని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.డిసెంబర్ 9నే రుణమాఫీ(Loan waiver) చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారని గుర్తు చేశారు. ఈ సంధర్బంగా బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలపై అసహనం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ బీజేపీ కేంద్ర కార్యాల యంలో బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడారు.రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తా రన్నారు. చాలా తక్కువ మంది రైతులే సన్న వడ్లు పండిస్తారని, దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బం ది ఏంటని ప్రశ్నించారు.

ఈ ప్రభు త్వం బోనస్ పేరుతో రైతులను(Farmers)మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉంద న్నారు. రబీ కింద 75 లక్షల ధాన్యం సేకరించాలని ఒప్పందం కుదుర్చు కుందని గుర్తు చేశారు.రెండు పార్టీల ది ఒకే తీరని, గతంలో బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు లను మోసం చేస్తున్నాయని సీరి యస్ అయ్యారు. ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి వారాలు గడు స్తున్నా పట్టించుకోకపోవడం దారు ణం అన్నారు. మార్కెట్(Market yards) యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారన్నారు. నిన్న 75 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, ఇలా గే కొనసాగితే ధాన్యం కొనేందుకు మరో 2 నెలలు సమయం పడు తుందన్నారు. వర్షాలు పడి ధాన్యం మొలకలు వస్తుంటే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.

Revanth government cheated Farmers