–ఆధానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిపిసిసి
— పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, నాయకులు
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ సంపదను కార్పొరేట్ దిగ్గజం ఆధానికి దోచిపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. ఈ డి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టింది. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, నాయకులు, (Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka, Ministers, Leaders,) కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ధర్నా కార్య క్రమంలో డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లా డుతూ మల్లు అదానీ దోచుకున్న ఆస్తులు దేశ ప్రజలకు చెందే వరకు, జాయిం ట్ పార్లమెంటరీ కమిటీ వేసే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు.
దేశం కోసం, దేశ ప్రజల ఆస్తులు (For the nation, the assets of the nation’s people) కాపాడడానికి ఈ డి కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం ఉన్నతమైనదని అభివర్ణించారు. రేపు రోడ్లపైకి ఎక్కింది కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, దేశ ప్రజల కోసం అఖిలభారత కాంగ్రె స్ కమిటీ ఇచ్చిన పిలుపును అందుకొని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తు న కదిలి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ దేశ సంపద దోపిడీకి గురికావద్దు ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు చెందాలని ప్రియ తమ నాయకుడు రాహుల్ గాం ధీ పెద్ద ఎత్తున గత కొద్ది సంవ త్సరాలుగా పోరాటం చేస్తున్నారు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రధాని మోడీ (Prime Minister Modi) అదాని లాంటి వాళ్లకు ఈ దేశ సంపదను ఎలా దోచిపెడుతున్నాడో పాదయాత్రలో వివరించారు. ఈ దేశ సంపద దోపిడీకి గురికాకుండా అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం అంతా నిలబడి పోరాటం చేస్తుం దని ఆనాడే రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ దేశంలోని ఆస్తులు, సంపద, వనరులు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. వాటిని ప్రధాని మోడీ అదాని వంటి క్రోని కాపీటలిస్టులకు దోచిపెడుతున్నారు. ఈ దేశ ప్రజల పక్షాన యావత్ కాంగ్రెస్ శ్రేణులు నిలబడాలని ఆనాడే పిలుపుని చ్చారు. రాహుల్ గాంధీ వివరంగా చెప్పినప్పుడు మొదట స్పందించ కపోయినా ఇప్పుడు క్రమంగా ఒక్కొ క్క అవినీతి వెలుగులోకి వస్తుంది. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా హిడె న్ బర్గ్ లాంటి సంస్థ దోపిడీని వివ రంగా బయట పెట్టిందని చెప్పారు. దేశ సంపదను జాగ్రత్తగా కాపాడా ల్సిన సెబీ చైర్మన్ (SEBI Chairman)ఈ దోపిడీ లో భాగస్వామిగా ఉన్నారని హీడెన్ బర్గ్ స్వతంత్ర సంస్థ పరిశోధించి బయట పెట్టడంతో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని వివరించారు.
ఆనాటి నుంచే ప్రియతమ నేత రాహుల్ గాంధీ గళం విప్పి పోరాటం చేస్తున్నారు. మేం చెప్పిందే చే యాల్సిన పనిలేదు అన్ని పార్టీలతో కలిసి జాయింట్ పార్లమెంటు కమి టీ వేయండి దేశ సంపదను కాపాడాలి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే మోడీపట్టించు కోకుండా పోయారు. ప్రధాని మోడీ పట్టించుకోకపోవడంతోనే తప్పని పరిస్థితుల్లోనే అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఈడీ కార్యాలయాలు ఎదురుగా ధర్నాకు పిలుపునిచ్చింది.ఈ దేశ సంపదను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, దేశ సంపదను కాపాడే బాధ్యతను భుజస్కందాలపై వేసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయం ఎదుట, రాష్ట్రంలో పిసిసి అధ్య క్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏకోన్ ముఖంగా మంత్రులు ఎమ్మె ల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ సీన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.