Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy:ఆమాత్యులవర్గం రుణమాఫీకి ఆమోదం

–నియమ నిబంధనలకు గ్రీన్ సిగ్నల్ తో త్వరలో అధికారిక ఉత్తర్వులు
–అర్హులైన, నిస్సహాయులైన ప్రతి ఒక్కరికీ వర్తింపజేస్తాం
–డిసెంబరు 9వ తేదీ వరకు ఐదేళ్ల ముందున్న రుణాలన్నీ మాఫీ
–హామీ వెరవేర్చేందుకు రేవంత్ ప్ర భుత్వంపై రూ.31 వేల కోట్ల భారం
–రైతు భరోసా విధివిధానాల రూప కల్పనకు మంత్రివర్గ ఉపసంఘం
–డిప్యూటీ భట్టి, మంత్రులు తుమ్మ ల, శ్రీధర్‌బాబు, పొంగులేటి సభ్యు లుగా జూలై 15 కల్లా నివేదిక, అసెం బ్లీలో చర్చకు నిర్ణయం
–రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాల ను మీడియా సమావేశంలో వెల్ల డించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఊహా జనితాలకు ఊతమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రుణమాఫీపై (loan waiver)ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రుణమాఫీకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం లభించడంతో రైతుల ఎదురుచూపులకు ఉపశమ నం లభించింది. అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం తో అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (thumala nageshwarao), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు (poleti srinivas reddy)సభ్యులుగా ఉదనుండగా వచ్చే నెల జూలై 15 లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని మంత్రి వర్గం ఆదేశించడం తద్వారా సదరు నివేదికను శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చకు పెట్టి, సభ్యుల నుంచి అభిప్రాయా లు తీసుకోవాలని, తద్వారా పథ కాన్ని ఆచరణలో పెట్టాలని రేవంత్ (revanth Reddy)ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని మీడియాకు వెల్లడించడానికి ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను అధికార ప్రతినిధు లుగా నియమించారు కూడా. కాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్ర వారం సచివాలయంలో సీఎం రేవం త్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గం టల నుంచి రెండున్నర గంటల పా టు జరిగింది. పంట రుణాల మా ఫీ, రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకోగా సదరు వివరాలను ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన వివిధ రకాల సమా చారమివ్వడానికి, అపోహలను నివృత్తి చేయడానికి ఇద్దరు మంత్రు లను అధికార ప్రతినిధులుగా నియ మించాలని కేబినెట్‌ నిర్ణయించిం దని రేవంత్‌రెడ్డి (revanth Reddy)చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల సొంత మీడియా లో కొన్ని విషయాలను చిలవలు పలవలు చేసి, ప్రభుత్వంపై అపో హలు కలిగించే ప్రయత్నం చేస్తున్నా రని రేవంత్‌ ఆరోపించారు. మంత్రు లను లేనిపోని విషయాలపై ఏదో ఒకటి మాట్లాడించి, దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని రేవం త్‌ ఆరోపించారు. అందుకే, మంత్రి వర్గ నిర్ణయాలతో పాటు ప్రభుత్వా నికి సంబంధించిన కీలక విషయాల ను మీడియాకు వెల్లడించేందుకు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలకు బాధ్యత అప్పటిస్తున్నట్లు చెప్పారు. ఇకపై ప్రభుత్వానికి సం బంధించిన ఎలాంటి సమాచార మైనా, అపోహలు తలెత్తినప్పుడు ఇచ్చే వివరణలైనా ఈ ఇద్దరు మం త్రులే వెల్లడిస్తారని, అదే అధికారిక సమాచారమని రేవంత్‌ స్పష్టం చేశా రు. మీడియా కూడా అనుమానాల నివృత్తికి వీళ్లిద్దరినే సంప్రదించాలని చెప్పారు. రాజకీయ అంశాలపై ఏ మంత్రి అయినా మాట్లాడతారని, ప్రభుత్వ పాలనకు సంబంధించి మాత్రం ఈ ఇద్దరు సమాచారం ఇస్తారని వివరించారు. రుణ మాఫీ విషయంలో తినబోతూ రుచులెం దుకని, నలభీమ పాకం వండే భట్టి విక్రమార్కకు నిధుల గురించి తెలు స్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకా రం మాఫీ చేసి తీరతామని రేవం త్‌రెడ్డి (revanth Reddy)స్పష్టం చేశారు. నిధుల సమీ కరణకు సంబంధించి లోతైన సమా చారం కావాలంటే ఆర్థిక మంత్రిని అడగాలని చమత్కరించారు. రుణ మాఫీ ఏ ప్రాతిపదికన చేస్తామన్నది తమ అంతర్గత అంశమని, అర్హు లు, అనర్హుల గురించి విధివిధానా లు రూపొందుతున్నాయని, మాఫీ నియమ నిబంధనలను మంత్రివర్గం ఆమోదించిందని, త్వరలో జీవో వెలువడుతుందని రేవంత్‌ ప్రకటిం చారు. గడువులోగా చేయాలన్నదే తమ తాపత్రయమని, కేసీఆర్‌లాగా (KCR)ఐదేళ్లలో చేయాలంటే ఇంత హడా వుడి పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

*రాహుల్ నాడే హామీ ఇచ్చారు…*

రాహుల్‌గాంధీ (Rahul Gandhi)2022 మే 6న వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తు న్నట్లు రేవంత్‌ ప్రకటించారు. వ్యవ సాయం అంటే దండగ కాదు పండు గ చేయాలన్న పార్టీ ఆలోచన మేర కు మాఫీని చేపడుతున్నట్లు చెప్పా రు. సోనియా, రాహుల్‌, ఖర్గేలు మ డమ తిప్పని నేతలని ఈ సందర్భం గా ఆయన ప్రస్తావించారు. 2004 లో కరీంనగర్‌ గడ్డ మీద తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా గాంధీ దాన్ని నిలబెట్టు కోవడానికి ఎంతటి సాహసోపే తమైన నిర్ణయం తీసుకున్నారో అందరికీ తెలుస న్నారు. ఆ క్రమంలో ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభంతో కాంగ్రెస్‌ ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న ప్పటికీ సోనియా తన మాటను నిల బెట్టుకున్నారని చెప్పారు. సోనియా లాంటి కమిటెడ్‌ నాయకత్వం నుం చి వచ్చిన రాహుల్‌గాంధీ కూడా వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చారని ప్రస్తావించారు. ఇది అలవికాని హామీ అని ఎంతమంది అన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయిం చిందన్నారు. ఇందుకు సంబంధిం చిన అన్ని అంశాలను క్యాబినెట్‌ చర్చించిందని, వివిధ బ్యాంకులలో ఉన్న రుణ వివరాలను సేకరించి, క్రోడీకరించి, రుణ మాఫీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు ప్రభు త్వం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పదేళ్ల వ్యవధిలో రెండుసార్లు మాఫీ చేసినప్పటికీ మొత్తం 28 వేల కోట్లు మాత్రమేనన్నారు. తొలి విడత మాఫీలో రూ.16 వేల కోట్లు, మలి విడత మాఫీలో రూ.12 వేల కోట్ల రుణాలను రద్దు చేసిందని రేవం త్‌రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్‌ (kcr) చివరి సారిగా 2018 డిసెంబరు 11 వరకు కట్‌–ఆఫ్‌–డేట్‌ తీసుకుని రుణ మాఫీ చేసినందున తమ ప్రభుత్వం ఆ మర్నాటి నుంచి 2023 డిసెంబ రు 9 వరకు కట్‌–ఆఫ్‌–డేట్‌గా తీసుకుంటోందని చెప్పారు. రుణ మాఫీకి రూ.31 వేల కోట్లు ఖర్చ వుతాయని అంచనా వేశామని, ఆ మేరకు నిధులు సేకరించి, తెలం గాణ రైతాంగాన్ని రుణ విము క్తులను చేస్తామని ప్రకటించారు. మొత్తం ఒకే దఫాగా రూ.2 లక్షల రుణమాఫీ జరిగిపోతుందని వెల్ల డించారు. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో, వడ్డీలు చెల్లిస్తామంటూ రకరకాల ప్రకటనలు చేసి, వాయి దాలపై వాయిదాలు వేసుకుంటూ రైతులను, వ్యవసాయాన్ని సంక్షో భంలోకి నెట్టిందన్నారు. పలువురు రైతుల ఆత్మహత్యలకు కారణమైం దని విమర్శించారు. పదేళ్లలో బీఆ ర్‌ఎస్‌ ప్రభుత్వం ఏనాడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని మండిప డ్డారు. తమ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఎనిమిది నెలల్లోపే పంట రుణాల మాఫీ నిర్ణయాన్ని తీసుకుం దని గుర్తు చేశారు. తాము అధికా రానికి వచ్చిన తొలి ఆరు నెలల్లో రెండు నెలలు ఎన్నికల కోడ్‌తోనే గడిచి పోయిందని ప్రస్తావించారు. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం ఒక సామాజిక బాధ్యతతో, చిత్తశుద్ధితో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రుణ మాఫీని కేబినెట్‌ ఆమోదిం చిన శుక్రవారం రోజు తన జీవి తంలో చరిత్రాత్మకమైన రోజు అని ట్విటర్‌ (twitter)వేదికగా కూడా రేవంత్‌ చెప్పారు.