Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: రైతుల పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి

*ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ చిత్రపటాలకు పాలాభిషేకం

Revanth Reddy:ప్రజా దీవెన, కోదాడ: రైతుల పక్షపాతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)అని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి (Oruganti Srinivas Reddy), ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, కాపుగల్లు పిఎసిఎస్ చైర్మన్ నంబూరి సూర్యం ఆన్నారు. గురువారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, గ్రామంలో రైతు వేదికల వద్ద రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కోదాడశాసనసభ్యురాలు ఉత్తం పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాలను (Palabhishek programs)నిర్వహించారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల(Election) సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారన్నారు మాట ఇచ్చిన ప్రకారం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ (Congress party)దానే వారు అన్నారు. రుణమాఫీ కానీ రైతులు ఎవరు అధైర్య పడద్దోద్దని ఆగస్టు 15 లోపు అందరికీ రుణమాఫీ అవుతుందన్నారు. ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోమాజీ సర్పంచ్ గంగిరెడ్డి కన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డికౌలు రైతు సంఘం అధ్యక్షుడు అన్నెం పాపిరెడ్డి,దేవాలయ కమిటీ చైర్మన్ అన్నెంచిన్న వెంకటరెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ అన్నెం నరసింహారెడ్డి,అన్నెం పెద్ద వెంకటరెడ్డి, ఎర్రవరం గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్ కే లతీఫ్, పాముల వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబర్ గురవయ్య, కారంగుల నరేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు