Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy:విశ్వ నగరంగా భాగ్యనగరం

–ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతం గా తీర్చిదిద్దుతాం
–ప్రపంచంలో మూలల నుంచి ఎవ రొచ్చినా అక్కున చేర్చుకుంటాం
–లక్షన్నర కోట్లతో ప్రణాళికాబద్ధంగా మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి
–గోపనపల్లి ప్లైఓవర్‌ను ప్రారంభo లో న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాదును విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని, త్వ రలోనే ఆవిష్కృతమవుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy)పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గండిపేట, హిమాయత్‌ సాగర్‌ నుం చి గేట్లు ఎత్తితే నల్లగొండ వరకు మూసీ నీళ్లు స్వచ్ఛంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని సీ ఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మూసీ పరివాహక అభివృద్ధికి ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో పనులు ప్రారం భిస్తామని తెలిపారు. శని వారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (komati reddy ventakt reddy), పొంగులేటి శ్రీనివాస్‌రె డ్డితో కలిసి శేరిలింగంపల్లి నియోజ కవర్గంలోని గోపనపల్లిలో ఫ్లైఓవర్‌ ను సీఎం రేవంత్‌రెడ్డి (revanth reddy) జెండా ఊపి ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా సీఎం మా ట్లాడుతూ హైదరాబాద్‌ అభివృద్ధి చెందినప్పుడే, శాంతిభద్రతలు కా పాడినప్పుడే ఇతర ప్రాంతాల నుం చి వచ్చిన వారికి విద్య, ఉపాధి అ వకాశాలు కల్పించినప్పుడే విశ్వ నగరంగా మారుతుందన్నారు. హైద రాబాద్‌ను విశ్వనగ రంగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చే సుకోవడమే తమ బాధ్యత అని స్ప ష్టం చేశారు. ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంద ని, రాబోయే ఐదేళ్ల లోపు మూసీని చూసేందుకు ప్రపంచం నలుమూల ల నుంచి పర్యాటకులు వచ్చేలా మారు స్తామని అన్నారు. హైటెక్‌ సిటీని చూస్తే ఓ సీఎం గుర్తుకు వస్తా రని, ఐటీ, అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు చూస్తే ఇంకొక ప్రభుత్వం గుర్తుకు వస్తుం దని, మూసీ అభివృద్ధిని చూస్తే త మ ప్రజా ప్రభుత్వం గుర్తుకు వచ్చే లా చేస్తామని ప్రకటించారు. ఆదాయం హైదరాబాద్‌ నుంచే..

తెలంగాణ (telangana)రాష్ట్రానికి 65 శాతం ఆదాయం హైదరాబాద్‌ నుం చే వస్తోందని సీఎం రేవంత్‌ (revanth)తెలి పారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి ఉపాధి అవకాశాల కోసం ఎంతోమంది ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుం టున్నారని అన్నారు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా.. అక్కున చేర్చుకొ ని ఉపాధి పొందే అవకాశం కల్పి స్తున్నామని, ఇక్కడి ప్రజలూ సహకరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వైఎస్‌ ఉన్నప్పుడే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నదీ జలాలు తీసుకొచ్చారని, పీవీఎన్‌ఆర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించారని, చంద్రబాబు ప్రణాళికలను కొనసాగిస్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించారని గుర్తు చేశారు. గోపనపల్లి ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం భూమి రూ.వంద కోట్ల దాకా పలుకుతోందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కోర్‌ అర్బన్‌ ఏరియా కింద అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు కాపాడేందుకు, ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించేందుకు, వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు రాకుండా చూసేందుకు హైడ్రా పేరిట నూతన వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు.