–అదానీకి మోదీ నిలువునా దోచిపెడుతున్నారు
–ఆధాని దోపిడీ, సెబీ స్కాంపై కేసీఆర్ వైఖరేంటో చెప్పాలి
–మాయ, మోసం బీఆర్‌ఎస్ విధా నం, నమ్మి మోసపోవద్దు
–మాఫీ ముమ్మాటికి జరిగి తీరు తుంది, రోడ్డెక్కొద్దు
–పదేళ్లలో వాళ్లు ఇచ్చిందెంతో పది మాసాల్లో మేం ఇచ్చింది తేల్చుకుం దామా
–ఈడి కార్యాలయం ఎదుట ధర్నా లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో అదానీ, అంబానీలకు దోచి పెట్టే పనిలో ప్రధాని మోదీ ఉన్నారని, ప్రజాధనాన్ని లూటీ చేసినవారిని జైలుకు పంపేవరకు పోరాటం జర గాలని రేవంత్ (Revanth Reddy) పేర్కొన్నారు. గుజ రాత్‌కు చెందిన గాంధీ, పటేల్ పేరు చెబితే ప్రపంచమంతా నమస్కరి స్తుందని మోదీ, అమిత్ షా మాత్రం ప్రపంచాన్ని దోచుకునేవారిలా కనిపి స్తున్నారన్నారు. వారిద్దరు వారికి ద్దరు అదానీ, అంబానీ అన్నట్టు పరి స్థితి తయారైందని ద్వజమెత్తారు. గుజరాత్‌కు (Gujarat) చెందిన ఈ దుష్ట చతు ష్టయం దేశాన్ని దోచుకుంటోందని, 67 ఏళ్లలో 16 మంది ప్రధానులు రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే, మో దీ రూ.1.15 లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఆర్థిక వ్య వస్థను చిన్నాభిన్నం చేయడం తప్ప మోదీ చేసిందేం లేదని ధ్వజమెత్తా రు. సెబీ చైర్ పర్సన్‌పై విచారణ జరపాలని, తక్షణమే ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు.కేంద్ర దర్యాప్తు సంస్థలను గుప్పిట పట్టి, కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విధానాలకు నిరసనగా దేశంలో అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయాల ఎదుట నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
టీపీసీసీ ఆధ్వర్యంలో (Under TPCC) గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో రేవంత్ పాల్గొని మాట్లాడారు.సెబీ–అదానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలన్న ఇండియా కూటమి డిమాండ్ పట్ల బీఆర్‌ఎస్ విధానం ఏంటో చెప్పాలని కేసీఆర్‌ను సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. చిల్లర, మల్లర విషయాలపై స్పందించే ట్విట్టర్ టిల్లు (కేటీఆర్).. అదానీ దోపిడీపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. బీజేపీకి బీఆర్‌ఎస్ (brs)అనుకూలం అనేందుకు ఇది స్పష్టమైన సాక్ష్యమని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షాను మెప్పించేందుకు అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరు తీస్తమంటున్నారని, సచివా లయం ముందు విగ్రహం తొలగిస్త మంటున్నరని, ఆ విగ్రహం మీద చేయి వేస్తే, వీపు చింతపండు కాకపోతే తన పేరు మార్చుకుం టానని ప్రకటించారు. దేశ సంపద ను కాపాడాలనుకునే ప్రతి యువ తకు ఆదర్శం రాజీవ్ (rajeev) అని అందుకే ఆయన విగ్రహం పెడుతున్నామని చెప్పారు.
బిఆర్ఎస్ ను నమ్మితే ఆయా సం తప్ప మరొకటి కాదు..
బీఆర్ ఎస్ సన్నాసులను నమ్ము కుని రోడ్డె క్కితే ఆయాసం వస్తుం దని, ప్రభుత్వం ఉన్నదే రైతుల కోసమని, ప్రజా పాలనతో అందుబా టులో ఉంటూ, ఇబ్బందులు విం టూ పరిష్కారానికి కృషి చేస్తు న్నా మని సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారు. ‘ఏ రైతుకు రుణ మాఫీ జరగకున్నా, రుణం రాకపోయినా, ఏ సమస్య ఉన్నా కలెక్టర్ కా ర్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ వేసి కూర్చొబెట్టిన అధికారులను లేదా వ్యవసాయ శాఖ అధికారులను కలవండి, పరిష్కారానికి వారు కృషి చేస్తారు. మీరు రోడ్డు ఎక్కడం ఎందుకు, ధర్నాలు చేయడం ఎం దుకు, రూ.2 లక్షల వరకు రుణ మా ఫీ చేశాం, మిగతావీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘వచ్చి నోళ్లను కలుస్తున్నం. సమస్యలు విని పరిష్కరిస్తున్నం.
అలా చేయకుంటే నిరసన, ధర్నా, రాస్తా రోకోలకు దిగొచ్చు. ఎందుకీ కష్టం అని రేవంత్ (revanth reddy) అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు, రామారావు (KCR, Harish Rao, Rama Rao) రైతులను దోచుకుతిన్నారని, మాయ, మోసం చేయాలన్నదే వాళ్ల ఆలోచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దొంగలే ముసుగు వేసుకుని వస్తున్నారని.. 6 నెలల కింద బొంద పెట్టిన సన్నాసులను రైతులు మళ్లీ ఎలా రానిస్తున్నారని వ్యాఖ్యానించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ వాళ్లు ఇచ్చిందెంత, పది నెలల్లో తాము ఇచ్చినదెంత అనేదానిపై అమర వీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజల వద్దకు వెళ్లి మోదీ పాలనలో వారి సంపద ఎలా దోపిడీకి గురైందో వివరించడమే తమ ప్రయత్నం అని తెలిపారు. పారిశ్రామికవేత్త అదానీ దోపిడీని లోక్‌సభలో రాహుల్ గాంధీ బయటపెట్టారని.. అయినా మోదీ తన పరివారాన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో హామీ ఇచ్చిన ప్రకారం రుణ మాఫీ చేస్తుంటే.. రైతుల ముసుగులో కార్యకర్తలతో బీఆర్‌ఎస్ ధర్నాలు చేయిస్తూ రెచ్చగొడుతోందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి పేరిట తప్పుడు రాతలు, కారు కూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు నెలలకోసారైనా కేసీఆర్ ముఖం చూశారా? అని ప్రశ్నించారు. ఫాంహౌజ్‌లో బోర్లా పడుకునేవాడని.. తాను, తమ మంత్రులు రోజుకు 18 గంటలు గ్రామాల్లో తిరుగుతున్నామని చెప్పారు. పదేళ్లు తెలంగాణను తలుగబెట్టినోడు.. పది నెలలు కాక ముందే తమ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్న తీరును కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో వివరించాలని సూచించారు. మోదీ, బీజేపీ, బీఆర్‌ఎస్‌పై కొట్లాడుదామని పిలుపునిచ్చారు. రాజీనామా చేయాల్సి వస్తుందని హరీశ్ కొత్త మాటలు చెబుతున్నడని, మైనంపల్లి సిద్దిపేట వెళ్లి మాట్లాడుదాం రమ్మంటే.. హరీశ్ అటు పోలేదన్నారు. తర్వాత జగ్గారెడ్డిని సిద్దిపేటకు పంపుతామని చెప్పారు.
తెలంగాణ తల్లి ఇప్పుడు గుర్తొచ్చిందా…
సోనియా జన్మదినం, తెలంగాణ (Telangana) ఏర్పాటుపై తొలి ప్రకటన వెలు వడిన డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత తమదన్నారు. బీఆర్‌ఎస్ సన్నాసులు పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడా పెట్టలేదని.. ప్రజలు ఓడించాక వారికి తెలంగాణ తల్లి విగ్రహం గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. పది నెలల్లో తాము విగ్రహం పెట్టి.. ఆ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకుంటామని రేవంత్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలను వ్యాపింపజేస్తున్నారని, మోదీ కూడా వాట్సప్ యూనివర్సిటీలో ఇలానే పెట్టారని, 400 సీట్లు వస్తాయని ప్రచారం చేశారని రేవంత్ పేర్కొన్నారు. బీజేపీకి (bjp) 240 సీట్లకు మించవని తాను చెప్పినది నిజమైందన్నారు. ఒక్క లోక్‌సభ సీటైనా గెలవమని కేటీఆర్‌ను (ktr) సవాల్ చేశానని.. ఆ పార్టీకి ఏడుచోట్ల డిపాజిట్ రాలేదని, 15 చోట్ల మూడో స్థానంలో నిలిచారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాలు కూడా రావని అన్నారు.