–శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మెట్రో రైలు
–ఓఆర్‌ఆర్‌ను కలిపేలా 200అడు గుల రోడ్డు
–3 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం
–150 కోట్లతో స్కిల్ వర్సిటీ నిర్మా ణం
–స్కిల్ వర్సిటీ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, రంగారెడ్డి: ముచ్చర్లలో న్యూయార్క్‌ను మించిన మహానగ రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చెప్పారు. నిజాం నవాబు హైదరా బాద్‌ను, బ్రిటిష్‌వాళ్లు సికింద్రాబాద్‌ను, చంద్ర బాబు, వైఎస్‌లు సైబరాబాద్‌ను నిర్మించగా నాలుగో నగరాన్ని తా ము ముచ్చర్లలో నిర్మించ బోతున్నా మని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగురోడ్డు (International Airport, Outer Ring Road)నిర్మాణం వల్ల శివారు ప్రాంతాల్లో ఎకరా రూ.100 కోట్ల వరకు ధరలు పెరిగాయని రేవంత్ (Revanth Reddy) చెప్పారు. ఇక్క డ కొత్తగా ఏర్పాటు చేయనున్న అధునాతన మహానగరంతో చుట్టు పక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయన్నారు. వేలాది ఎక రాల భూముల్లో న్యూయార్క్, సింగ పూర్, దుబాయ్‌లకు మించిన మహానగరాన్ని నిర్మిస్తామని తెలి పారు. కాలుష్యరహిత పరిశ్రమల తో పాటు విద్య, ఆరోగ్యం, పర్యాట క హబ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కొందరు వెటకారంగా మాట్లాడుతున్నారని, వారందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే చెబుతున్నా ఇక్క డకు రూ.వేల కోట్ల పెట్టుబడు లు తెచ్చి న్యూయార్క్ కంటే అధు నాతన నగరాన్ని కచ్చితంగా నిర్మిస్తా మని రేవంత్ స్పష్టం చేశారు. రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవ ర్గంలోని కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) శంకుస్థా పన చేశారు.
ఈ సందర్భంగా జరిగి న బహిరంగ సభలో ఆయన మా ట్లాడారు. యువతకు ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం గా 57 ఎకరాల్లో రూ.150 కోట్లతో స్కిల్ వర్సిటీని (Skill University) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ముచ్చర్ల– బేగరి కంచె ప్రాంతం రూపురేఖలన్నీ మారిపోతాయని చెప్పారు. ఈ ప్రాంతానికి శంషాబాద్ అంతర్జాతీ య విమానాశ్రయం నుంచి మెట్రోలై న్ అనుంసధానం చేస్తామని, అలా గే ఔటర్ రింగురోడ్డుకు నేరుగా వెళ్లేం దుకు 200 అడుగుల రోడ్డు నిర్మా ణం చేపడతామని ప్రకటించారు. ఈ భూసేకరణ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ముచ్చ ర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూము లు ఇచ్చిన రైతులందరికీ అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రైతు కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు (Unemployed youth) ఈ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ ఇప్పించి, వారి కి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ముందుగా ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం తీసుకుని, అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, ఇళ్లకు కూడా వెళ్లకుండా సరాసరి ఇక్కడకే వచ్చామని రేవంత్ తెలిపారు. యూనివర్సిటీ నుంచి ఏటా వేలాది మందికి శిక్షణ ఇచ్చి రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందిస్తామని వెల్లడించారు. అలాగే ఈ ప్రాంతానికి ఆనుకుని ఉన్న రిజర్వుడు ఫారెస్ట్‌ను అభివృద్ధి చేసి నైట్ సఫారీ ఏర్పాటు చేస్తామని, పర్యాటకులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వర్సిటీలో అడ్మిషన్‌తో కచ్చి తంగా ఉద్యోగం… తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగ సమస్య ఒక కారణమని, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యమంలో ముం దు నడిచారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఏటా లక్ష మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారని, నైపు ణ్యాలు లేకపోవడంతో వారికి ఉద్యో గావకాశాలు దక్కడం లేదని చెప్పా రు. స్కిల్ వర్సిటీ నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తుంద న్నారు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు, అధికారులు దీనికి సహ కరిస్తున్నారని చెప్పారు. ప్రజాప్రభు త్వం గొప్ప ఆశయంతో, ఈ ప్రాంతా న్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన తో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో స్కిల్ యూ నివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వర్సిటీలో అడ్మిషన్ వస్తే జాబ్ గ్యారెంటీ అని సీఎం పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీలో శిక్షణ పొందే వారికి ఉద్యోగావ కాశాలు కల్పించేందుకు ఇప్పటికే రెడ్డి ల్యాబ్, ఎస్‌బీఐ లాంటి సంస్థ లు ముందుకు వచ్చాయని తెలి పారు. హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలల్లో చేపడతామని సీఎం చెప్పారు. ఓఆర్‌ఆర్ పనులు వైఎస్ చేపడితే ఆర్‌ఆర్‌ఆర్ పనులు మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి (Minister Koma Ti Reddy Venkata Reddy)ఆధ్వర్యంలో జర గనున్నాయని తెలిపారు. అంద రి సహకారంతో ముచ్చర్లలో కొత్త నగర నిర్మాణాన్ని పూర్తిచేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. కొత్త ఆలోచనతో కొత్త నగర నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నిరు ద్యోగ యువతకు ఉపాధి కల్పిం చేందుకు ముందడుగు వేశామని చెప్పారు. నూతన మహానగరంలో ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి స్థానికుల సహకారం ఎంతో అవస రమన్నారు.
ఇంతకన్నా ఆనందం ఏముం టుంది: భట్టి ముచ్చర్లలో జరుగు తున్న కార్యక్రమాన్ని సువర్ణాక్షరాల తో లిఖించదగినదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)అభివర్ణించారు. రాష్ట్రాభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న తపన, అందులో నుంచి వచ్చిన ఆలోచన లే ఈ బృహత్తర కార్యక్రమానికి పునాది అని చెప్పారు. రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం తమ కు ఎంతో సంతృప్తి కలిగిస్తోందని, ఇంత కంటే ఆత్మ సంతృప్తి మరేదీ ఉండదన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ యూనివర్సిటీ మంచి భవిష్యత్తును అందిస్తుంద న్నారు. గత ఫ్రభుత్వం భూముల న్నింటినీ పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిందని, భూములు ఇచ్చిన వారు ఏమైనా పర్వాలే దన్నట్టుగా వ్యవహరిం చిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం నిర్వాసితు ల జీవితాల్లో వెలుగులు నింపేందు కు 600 ఎకరాల్లో ఇళ్లు నిర్మించనుం దని వెల్లడించారు. ఏడాదిలో ఈ ప్రాంత రూపురేఖలు మార్చేస్తామ న్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో మంత్రి శ్రీధర్‌బాబు కృషి ఎంతో ఉందన్నారు.