–ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు సహకా రం, (Promote sports and support athletes) ఉద్యోగ భద్రత కల్పించేలా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాల సీని తీసుకురాబోతున్నట్లు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బడ్జెట్ లో క్రీడల ప్రోత్సా హానికి రూ.321 కోట్లు కేటాయిం చినట్లు గుర్తుచేశారు. చదువులోనే కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌర వం పెరుగుతుందనే నమ్మకం యువతలో కలిగిస్తామన్నారు.
తెలంగాణ క్రీడారత్నాలైన బాక్సర్ నిఖత్ జరీన్ గారు, క్రికెటర్ మొహ్మ ద్ సిరాజ్ (Nikhat Zareen, Cricketer Mohammad Siraj)గారికి గ్రూప్ 1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అం శంపై శాసనసభలో చర్చ సంద ర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశా లపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చా రు.నెట్ జీరో సిటీలో స్కిల్ యూని వర్సిటీ, హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ తోపాటు స్పోర్ట్స్ హబ్ ఏర్పా టుకు కూడా చర్యలు తీసుకుంటు న్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ స్పోర్ట్స్ యాక్టివిటీలు పెరిగేలా క్రీడా ప్రాంగణాల నిర్మా ణానికీ ప్రణాళికలు సిద్దం చేస్తు న్నామని ముఖ్యమంత్రి తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా క్రీడలు ఉపకరిస్తాయని ఈ సందర్భంగా సీఎం అన్నారు. శాసనసభ్యులు కూడా తమ క్రీడా స్ఫూర్తిని కూడా చాటుకునేలా ఇకపై ప్రతి బడ్జెట్ సెషన్ లో కార్యక్రమాలు నిర్వహించే సంప్రదాయాన్ని పునరు ద్ధరించే అంశంపై అఖిలపక్షంతో మా ట్లాడి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు