–నిపుణుల సూచనల మేరకు వరద నీటిని దిగువకు వదిలేయo డి
–అడ్డంకులేమి లేకుండా నీటిని దిగువకు ప్రవహించే విధంగా పటి ష్టమైన చర్యలు తీసుకోoడి
–మేడిగడ్డ బ్యారేజ్ భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
CM Revanth Reddy:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజక్టు (Kaleshwaram project) పరిధిలోని మేడిగడ్డ (Madigadda) భవిష్యత్తు పై తుదినివేదిక ఇవ్వా లని నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కోరనున్నారు. సోమవారం డిల్లీలో ఎన్డీఎ స్ఏ నిపుణులతో జరగనున్న సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారి టీ అభి ప్రాయాలను తీసుకోవాలని చెప్పా రు. మేడిగడ్డ ఎగువన తుమ్మిడి హెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించి గ్రావి టీ ద్వారా నీటిని సర ఫరా చేసే అం శంపై ఎన్టీఎస్ఎ సూచనలు తీసుకోవాలని అధికారు లకు చెప్పారు. అలాగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పై ఎన్నిఎ స్ఏ సూచనలు తీసుకోవాలని చెప్పారు.
ప్రధానంగా ఎంతకాలం మేడిగడ్డ (Madigadda)నుంచి నీటిని విడుదల (Release the water)చేయడంతో పాటుగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమీక్షించా లని అధికారులకుసీఎం చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహు ల్ బొజ్జా, రాష్ట్ర నీటిపా రుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్ పాల్గొన్నారు.సోమవారం జరగనున్న సమావేశానికి ఈఎన్సీ అనీల్ కుమార్ హాజరు కానున్నా రు. సోమవారం సాయం త్రం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రజలవనరులశాఖ మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) ను కలవను న్నారు.
కాళేశ్వరంతోపాటు తెలంగాణలోని అనేక ప్రాజెక్టులపై చర్చించ ను న్నారు. ఈసమావేశంలో నీటిపారుదల శాఖకు రావల్సిన పెండింగ్ నిధులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కొడంగల్ నారాయణ పేట ప్రాజెక్టుతో పాటుగా అనేక ప్రాజెక్టులను కేంద్ర మంత్రి కి సీఎం రేవంత్రెడ్డి వివరించనున్నారు. అయితే అంతకు ముందు ఎన్డీఎస్ఏ నిపుణులతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి సమా వేశమై అనేక అంశాలను ఎన్డీఎస్ఏ దృష్టికి తీసుకురా వడం తో పాటుగా మేడిగ డ్డపై తుదినివే దిక కోరనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలియ వచ్చింది.