Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: తెల్ల రేషన్ కార్డులకు మోక్షం..!

–ముఖ్యమంత్రి ప్రకటనతో ఆశా వహుల్లో ఆనందం
–ఉత్తర్వులు వెలువడిన వెంటనే ‘మీ–సేవ’ పోర్టల్‌ ఓపెన్‌
–10 లక్షల కొత్త దరఖాస్తులొస్తా యని అంచనాలో ప్రభుత్వం

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల (New Ration Cards) జారీకి రాష్ట్ర ప్రభు త్వం సమాయత్తం అవుతోంది. త్వరలో కొత్త కార్డులు జారీచేస్తా మని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించడంతో ఆశావహుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభు త్వ హయాం నుంచి కొత్త రేషన్‌ కార్డుల కోసం బీపీఎల్‌ కుటుంబాలు (BPL families) ఎదురుచూస్తున్నాయి. ఈ నేప థ్యంలో తాము అధికారంలోకి రాగానే కొత్తరేషన్‌ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. కానీ, అధికారంలోకి వచ్చాక లోక్‌సభ ఎన్నికలు, ఇతర గ్యారెంటీల అమ లుపై దృష్టిపెట్టడంతో రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ప్రకటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్‌ కార్డులు (Ration Cards) ఉన్నాయి. వీటిలో 55 లక్షల కార్డులు కేంద్ర ప్రభుత్వం జారీచేసినవి. రాష్ట్ర ప్రభుత్వ కార్డు లు 35 లక్షలు. కొత్త కార్డుల కోసం పోర్టల్‌ ఓపెన్‌ చేస్తే మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆరు గ్యారెంటీల (Six guarantees) అమలుకుగాను ప్రజల నుంచి దర ఖాస్తులు తీసుకున్నారు. అయితే గ్యారెంటీల ప్రొఫార్మాలో కొత్త రేషన్‌ కార్డుల ప్రస్తావన చేయలేదు. కానీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌ మేరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెల్లకాగితాలపై రాసిచ్చిన దరఖాస్తులను తీసుకున్నారు. కానీ ‘మీ–సేవ’లో పోర్టల్‌ మాత్రం ఓపెన్‌ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం (government key desicion) తీసుకున్న తర్వాత ‘మీ–సేవ’ పోర్టల్‌ ఓపెన్‌ చేసి, కొత్తగా దరఖా స్తులు స్వీకరించే అవకాశాలు ఉన్నా యి. ఇదిలాఉండగా రేషన్‌ కార్డులో అదనపు కుటుంబ సభ్యు లను చేర్చుకోవటానికి కూడా దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ఒక కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటే.. భార్యాభర్తల పేర్లు కార్డులో ఉండి పిల్లల పేర్లు లేకపోయినా, ఇద్దరు పిల్లల్లో ఒకరి పేరే ఉన్నా ‘మెంబర్‌ ఎడిషన్‌ (కొత్త సభ్యుల చేర్పులు, మార్పులు)’ ఫ్రొఫార్మాలో తీసుకుంటారు. అయి తే ‘మీ–సేవ’లో మెంబర్‌ అడిషన్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేసి ఉంది. దాంట్లో ఇప్పటివరకూ 11 లక్షల దరఖా స్తులు వచ్చాయి. వీటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే మెంబర్‌ అడిషన్‌పై కూడా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ రెండు ప్రక్రియలూ పూర్తిచేస్తే రేషన్‌ కార్డుల (Ration Cards) సమస్య దాదాపుగా కొలిక్కివచ్చే అవకాశా లున్నాయి. కాగా రాష్ట్రంలో బీపీఎల్‌ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కోటాలో ఉన్న 35 లక్షల రేషన్‌ కార్డులను కూడా సెంట్రల్‌ కోటాలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఢిల్లీకి లేఖలు రాసింది. కానీ కేంద్రం నుంచి ఇంతవ రకూ ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.