–మంత్రి పదవులు సైతం వారికే మొదటి ప్రాధాన్యం
–పీసీసీ చీఫ్‌పై కసరత్తు చివరి దశకు చేరుకుంది
–పార్టీ బీ ఫాంపై గెలిచిన వారికే చో టు, పీసీసీ, మంత్రి వర్గం విస్తరణ ఒకేదఫా
–ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ (Congress Party) బీఫామ్ పై గెలిచిన వారికే మంత్రివర్గంలో పద వులు దక్కుతాయని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. టీపీసీ సీ అధ్యక్షుడి నియామకం, మంత్రివ ర్గ విస్తరణ ఒకేసారి ఉంటాయని, వాటిపై చర్చలు జరుగుతున్నాయ ని, ఆ రెండు అంశాలకు సంబంధిం చి పేర్లతో కూడిన జాబితాను అధి ష్ఠానానికి అందించామని చెప్పారు. సామాజిక సమీకరణలకు అను గుణంగా నిర్ణయాలు ఉంటాయని, పీసీసీ చీఫ్ మహిళ (PCC chief is a woman)కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కావచ్చునని వ్యాఖ్యానించారు. అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా మని అన్నారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ పదవి మహిళకు ఇస్తే బాగుంటుంది కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా మీరు అడిగారని అధి ష్ఠానానికి చెబుతానులే అని నవ్వుతూ బదులిచ్చారు.
శుక్రవారం ఢిల్లీ లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చిట్ చాట్ నిర్వహించారు. మూడు, నాలుగు రోజుల్లో రుణమాఫీకి మార్గ దర్శకాలు విడుదల చేస్తా మని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానం కసరత్తు కొలిక్కి వచ్చినట్లు ముఖ్యమంత్రి ((Revanth Reddy) వ్యాఖ్యల్లో వెల్లడవుతోంది. ఈ రెండు అంశాలపై శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ((Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి(Uttam Kumar Reddy), పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. టీపీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, సురేశ్ షెట్కార్, బలరాంనాయక్, సంపత్‌కుమార్ పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం. లోతైన విశ్లేషణ తర్వాత రేసులో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ బలరాం నాయక్ పేర్లు మిగిలినట్లు అనివా ర్య కారణాలవల్ల సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ కూడా రేసులో కొనసాగుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసేట్లయితే వివాద రహితుడు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై సమగ్ర అవగాహన ఉన్న వాడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతు న్నట్లు తెలుస్తోంది.
మంత్రివర్గంలో ఎస్టీలకు చోటు దక్కకపోతే ఆ వర్గం నుంచి బలరాం నాయక్‌కు (Balaram Naik)టీపీసీసీ చీఫ్‌గా అవకాశం కల్పించాలన్న ప్ర తిపాదనపైనా చర్చ జరిగింది. రేవంత్, భట్టి, ఉత్తమ్, మున్షీల అభిప్రా యాలను పరిశీలించి అధిష్ఠానం నిర్ణయం తీసుకోనున్నట్లు సమా చారం. అదే సందర్భంలో మంత్రివర్గ విస్తర ణపైనా లోతైన చర్చ జరిగిన ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మీడియాకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక కూర్పు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యాలను పరిగణనలోకి తీసుకుని చర్చ జరిగి నట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న సీఎం హామీ మేరకు పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి (Sudarshan Reddy) మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, ఎడ్మ బొజ్జులపైనా చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ఆధారంగా సామాజిక సమీకరణలు చూసుకు ని మిగిలిన మంత్రి పదవులపై నిర్ణ యం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకటి లేదా రెండు బెర్తులు పెండింగ్‌లో పెట్టే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.తమ తొలి ప్రాధాన్యం రుణ మాఫీ అని, అసెంబ్లీ తర్వాత రైతు బంధు అమలు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత పింఛన్ పెంపు చర్యలు చేపడతామన్నారు. ‘‘కల్వకుర్తి ఏరియాలో నేషనల్ హైవే భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. దీనిపై సబ్ కమిటీ వేశాం. అది సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత అసెంబ్లీ చర్చిస్తాం. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా చూడాలనేదే మా ఉద్దేశం’’ అని వివరించారు. రైతుబంధు కింద రూ.75 వేల కోట్లు ఇచ్చానని కేసీఆర్ చెబుతున్నారని, అందులో రూ.25 వేల కోట్లు అనర్హులకే ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని, సంక్షేమం అనేది పేదలకు, మధ్య తరగతికి చెందాలని, కానీ, ఫాం హౌజ్‌లో ఉన్నోళ్లకూ రైతు బంధు (rythu bandhu) ఇచ్చారని తప్పుబట్టారు.
తెలంగాణలోనే ఫిరాయింపులు లేవు… ఫిరాయింపులు ఒక్క తెలంగాణలోనే ప్రత్యేకం కాదని, కర్ణా టక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో ఎమ్మెల్యేలు ఫిరాయించారని, నలు గురు టీడీపీ (tdp) రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకుందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అధికారాల ను దుర్వి నియోగం చేయను. కక్ష సాధింపు చర్యలకు పాల్పడను. అధికారులతో సమర్థంగా పని చే యించుకుం టాను. డీజీపీని కూడా నేను మార్చ లేదు. కేంద్ర ఎన్నికల సంఘం మార్చిందని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు చేసిన తర్వాత నిజాని జాలన్నీ కోర్టులకే చెప్పాలని అధి కారులకు సూచించానని తెలిపారు. ధరణిపై అధ్యయనం తర్వాత అసెంబ్లీలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు.కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తా మని లేదా జిల్లాలను తగ్గిస్తామని తాను చెప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy)తెలిపారు. మండలాలు, రెవె న్యూ డివిజన్లు, జిల్లాల డీలిమి టేషన్‌పై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయ మూర్తి నేతృత్వంలో కమిటీ వేస్తాన ని చెప్పాను. సదరు నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకుంటాం. అంతే తప్ప.. జిల్లాల ను కుదిస్తానని నేను చెప్పలేదు. అలాగే, జిల్లాలను పెంచుతానని కూడా చెప్పలేదని వివరించారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాలు పెద్దగా, మరికొన్ని చిన్నగా ఉన్నాయని, వాటిని హేతుబద్ధీకరించినప్పుడు పెరగొచ్చు తగ్గొచ్చునని వ్యాఖ్యా నించారు. మండలాలను ఇష్టాను సారంగా విభజించారని, చిన్న పల్లెలను కూడా కేసీఆర్ రెవెన్యూ డివిజన్ చేశారని, మండల కేంద్రా నికి ఒక ప్రాతిపదిక లేదని, వీటిపై బడ్జెట్ సమావేశాల్లో చర్చ పెడతా మని తెలిపారు.
ఉభయ సభల ప్రొరోగ్ కు గవర్నర్ ఉత్తర్వులు… రాష్ట్ర శాసన సభ, శాసన మండలి (State Legislative Assembly and Legislative Council)సమావేశాల ను గవర్నర్ రాధాకృష్ణన్ ప్రొరోగ్ చేశారు. ఈమేరకు రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. శాసనస భ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఎనిమిది రోజు ల పాటు, శాసన మండలి 9 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజుల పా టు భేటీ అయ్యాయి. అనంతరం వాయిదా పడ్డాయి. మళ్లీ ఆరు నెల ల్లోప తదుపరి సమావేశాలను ప్రా రంభించాలంటే ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈ దృష్ట్యా ఫిబ్రవరిలో జరిగిన ఉభయసభల సమావేశా లను 27 నుంచి ప్రొరోగ్ చేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.