–నీతి అయోగ్ సమావేశాన్ని బహి ష్కరించడమేంటని ప్రశ్న
–మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్క రించటంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో కేంద్రమంత్రి శనివారం పర్యటిం చారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై రాష్ట్ర బీజేపీ నేతలతో (BJP) ప్రహ్లాద్ జోషి చర్చించారు. అనం తరం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో మీడియా సమా వేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎ స్ పార్టీపై ప్రహ్లాద్ జోషి తీవ్ర విమ ర్శలు గుప్పించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది, కాం గ్రెస్ హయాంలో ఏపీ, తెలంగాణకు కలిపి రూ.5 నుంచి 6 వేల కోట్లు మాత్రమే గ్రాంట్లు వచ్చాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రూ.26వేల కోట్లను గ్రాంటుల రూపంలో ఇచ్చిందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరి వ్యవహరిస్తే.. కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం తప్పులను సరిచేసుకోవాలని ప్రహ్లాద్ జోషి హితవు పలికారు.అద్బుతమైన బడ్జెట్‌ను మోదీ (MODI) ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మోదీ సారథ్యంలో ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా భారత్ నిలిచిందని అన్నారు. అన్నీ రాష్ట్రాలకు మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ఈ ఏడాది రూ.5వేల కోట్లకు పైగా రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించామని తెలిపారు. రూ.48వేల కోట్ల రోడ్డు ప్రాజెక్టులు తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే మరిన్ని రోడ్లను విస్తరణ చేస్తామని అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను నిలపడానికి కృషి చేస్తున్నామని ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi)వ్యాఖ్యానించారు.