— రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్
Case Review ln Telangana : ప్రజా దీవెన, నల్లగొండ: గడచిన రెండున్నర నెలల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ 1500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసి నట్లు రాష్ట్ర మానవ హక్కుల కమి షన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ తెలిపారు. మంగళవా రం అయన నల్గొండ జిల్లా కేంద్రం లోని రోడ్లు, భవనాల అతిథి గృ హంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మానవ హక్కులకు భంగం కలిగిన ప్పుడు వచ్చిన ఫిర్యాదులను మా నవ హక్కుల కమిషన్ వాటిని పరి శీలించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ 2025 ఏప్రిల్ 17 న చార్జి తీసుకు న్నదని, తనతో పాటు, మ రో ఇద్దరు సభ్యులు కమిషన్ లో ఉ న్నారని, రాష్ట్రంలో ఎక్కడైనా మాన వ హక్కులు ఉల్లంఘన జరిగినప్పు డు ఆన్లై న్ ద్వారా లేదా రాతపూర్వ కంగా దరఖాస్తు ఇస్తే వాటిని పరిశీ లించి వాటిపై పూర్తి విచారణ చేసిన త ర్వాత చర్యలు తీసుకోవడం జ రుగుతుందన్నారు.
విచారణ అనం తరం అవసరమైతే ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు. వర్కర్స్ కు జీతాలు చెల్లించకపోవడం వారి హక్కులకు, స్వేచ్ఛకు, సమానత్వా నికి ఆటంకంకలగడం ఇలాంటివ న్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిం దికి వస్తాయని ,వీటిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు స్పందించడం జరు గు తుందన్నారు.
కమిషన్ ఛార్జ్ తీసుకున్న సమయం లో 11, 500 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, గడచిన రెండున్నర నెలల కాలంలో 1500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసిన ట్లు చెప్పారు. కొన్ని సుమోటో కేసు లు సైతం తీసుకోవడం జరుగుతుం దని ,అలాగే బాధితుల తరఫున ఇ చ్చే దరఖాస్తులను సైతం కమీషన్ స్వీకరిస్తుందన్నారు. ముఖ్యంగా వి ద్య,వైద్య తదితర సంస్థలను సం దర్శించి సరైన విధంగా అమల వు తున్నది ,లేనిది పరిశీలించడం జరు గుతుందని తెలిపారు.
మానవ హక్కుల పై ప్రజలకు అవ గాహన కల్పించేందుకు మానవ హ క్కుల కమిషన్ చర్యలు తీసుకుం టుందని, ప్రతి ఒక్కరికి మంచి వి ద్య, వైద్యం, సమానత్వం అందాల్సి న బాధ్యత రాజ్యాంగ ప్రకారం ఉం దని ఆయన తెలిపారు.