Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యానందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

విద్యా వ్యవస్థ బలోపేతానికి రూ. 22 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు
మెరుగైన గుణాత్మక విద్యా బోధ న అందించాలి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రాఫి శాఖమాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మక విద్యానందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (State Roads and Buildings Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. శనివారం నూతనకల్ జెడ్పి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ఆచార్య జయ శంకర్ సార్ బడిబాట కార్యక్రమం లో భువనగిరి పార్లమెంట్ సభ్యు లు చామల కిరణ్ కుమార్ రెడ్డి తో(Member of Parliament Chamala Kiran Kumar Reddy) కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మా ర్పులు తెచ్చిందని, ప్రతి పాఠశా లలో విద్యార్థులకు గుణాత్మక వి ద్యానందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతా నికి రూ. 22 వేల కోట్లు కేటాయిం చిందని స్పష్టం చేశారు.

పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 6 వేల పాఠశాలలు మూసివేయడం జరి గిందని అన్నారు. దశల వారిగా రూ. 600 కోట్లతో అన్ని పాఠశాలను మోడల్ స్కూల్స్ గా తీర్చిదిద్దు తామని అన్నారు. రాష్ట్రంలో అభ య హస్తం లో ఉన్న అన్ని పథకాలు అర్హులందరికీ అందిస్తామని అలాగే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఆగ స్టు 15 నాటికి చెల్లిస్తామని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్పోరేట్ స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించి పిల్లలకు బంగారు భవిష్యత్ కల్పించాలని సూ చిం చారు. ఇందిరమ్మ ఇండ్లను నియో జక వర్గాల వారీగా పేదలైన అర్హుల కు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో(Thungathurthy Constituency) పాత రోడ్లకు రూ. 75 కోట్లతో మరమ్మ తు లు చేపట్టేందుకు నిధులు మంజూ రు చేయడం జరిగిందని అలాగే రెండు సంవత్స రాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చెప్పట్ట నున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిదంగా ఈ ప్రాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లిఫ్టులు చేపట్టి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. నూతనకల్ పాఠశాలకు 10 కంప్యూ టర్లు అదేవిదంగా మరుగుదొడ్లు నిర్మాణానికి రూ. 10 లక్షలు అందిం చనున్నట్లు తెలి పారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవ ర్గ అభివృద్ధికి అధిక ప్రాధా న్యత ఇవ్వడం జరుగు తుంద ని అలాగే విద్యకు ప్రభుత్వం కట్టు బడి ఉందని, విద్యార్థులకు ఇష్టత తో చదివేవి దంగా నాణ్యమైన విద్యానందిం చాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 536 అమ్మ ఆదర్శ పాఠశాలలో 336 గుర్తించిన పనులను పూర్తి చేయడం జరిగిందని అలాగే మిగిలిన పాఠశాలలో పనులు పురోగతిలో ఉన్నాయని అలాగే ప్రభుత్వ లక్ష్య దిశగా పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించామని అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఏకరూప దుస్తు లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకా లు(Note books) ఈ సందర్బంగా అందచేశారు. ముందుగా విద్యార్థులు చేసిన నృత్యాలను ఎం.పి., జిల్లా కలెక్టర్ తో కలసి తిలకించి అభినందిం చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక, పి.డి. మధుసూదన రాజు, డి.ఈ. ఓ అశోక్, డి.పి.ఓ సురేష్ కుమార్, ఆర్ అండ్ బి ఈ ఈ భాస్కర్ రావు, dwo వెంకట రమణ, ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ కె. దామోదర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.

Revolutionary changes in education system