Rice Millers: ప్రజా దీవెన, హన్మకొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాయిల్డ్ రైస్ మిల్లర్స్ (Rice Millers)వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగల వినయ్ కుమార్ (Vinay Kumar) ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు మంగళవారం హన్మకొండ నక్కలగుట్టలోని ఎమ్మె ల్యే (mla) నివాస గృహంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చారు. అనంతరం సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా ఈ వానాకాలం ఖరీప్ సీజన్ (Kharif season) కు సంబంధించి ప్రభుత్వం వారు రైతుల దగ్గరి నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యంలో తేమ శాతం 14 మరియు FAQ నాణ్యత ప్రమాణాల మేరకు సేకరించాలని కోరారు. అదేవిధంగా, మిల్లర్లకు రావలసిన పెండింగ్ బకాయిలను త్వరితగతిన ఇప్పించాలని కోరారు. వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ నడిపెల్లి ప్రశాంత్ రావు, ట్రెజరర్ కల్లూరి కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ పెండెం రేపాల్, కార్యవర్గ సభ్యులు నర్సింగరావు, శ్రీనివాస్ రావు, రవీందర్, కార్తీక్, రాజు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.