RM John Reddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ఆర్టీసీలో పలు పనుల నిమిత్తం వెలువడిన టెండర్లలో వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్నవారు మరియు యువత పాల్గొని ఆర్థిక పరిపుష్టి పొందాలని నల్లగొండ రీజినల్ మేనేజర్ జాన్ రెడ్డి తెలిపారు. నల్లగొండ రీజియన్ లో పలు బస్ స్టేషన్ లలో ఉన్న ఖాళీ స్థలాలు, పక్కా మడిగలు, క్యాంటీన్, వాహన పార్కింగ్, లాజిస్టిక్ సర్వీస్, సెల్ ఫోన్ టవర్స్ కొరకు కాంట్రాక్టర్ల నియామకానికి, దామరచర్ల బస్టాండులో ఖాళీ ప్రదేశానికి ఎన్.ఓ.సి. తెచ్చుకుని పెట్రోల్ బంకు నడుపుట కొరకు సర్వీస్ ప్రొవైడర్ నియామకానికి, ప్రధాన రోడ్డుకి ఆనుకుని ఉన్న స్థలాలలో నిర్మాణానికి సిద్ధంగా ఉన్న షాపుల కొరకు అంచనాలు పొందడానికి టెండర్ ప్రకటన ఇటీవల విడుదలైంది.
ఈ సందర్భంగా ఆసక్తి గల బిడర్లు ఆన్లైన్ ద్వారా టెండర్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలని రీజినల్ మేనేజర్ జాన్ రెడ్డి కోరారు. పూర్తి వివరాలు టెండర్ ప్రకటన కొరకు https://tgsrtc. telangana.gov.in ను సందర్శించాలన్నారు. ఆన్లైన్ ద్వారా టెండర్ లో పాల్గొనుటకు https://tender. telangana.gov.in ను సందర్శించాలన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది. మరిన్ని వివరాలకు రీజనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 7382834223 సంప్రదించాలన్నారు.