రోడ్డు ప్రమాదం లో ఇరువురి దుర్మరణం
ప్రజా దీవెన/ జడ్చర్ల: జడ్చర్ల వెంకటేశ్వర కాలనీ కి చెందిన ముపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు చెన్నయ్య (37) ఇంద్ర నగర్ కాలనీకి చెందిన నాగార్జున (25) లు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదoలో దుర్మరణం పాలయ్యారు . ఉజ్జిల్ మండలం వైపు ఉన్న ఓ గ్రామంలో తమ బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో మున్ననూర్ వాడియాల మధ్య లో ఉన్న మూల మలుపు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నాగార్జున అక్కడికక్కడే మృతిచెందగా, చెన్నయ్య 108 లో తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ జమ్ములప్ప మిడ్జిల్ ఎస్సై రామ్ లాల్ నాయక్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు మండల కేంద్రంలోని పలు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.