అర్థరాత్రి ఆర్తనాదాలు, కారు నీట మునిగి ఐదుగురు మృత్యువాత
ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో జరి గిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అర్థ రాత్రి సమయంలో జరిగిన ప్రమాదం కావడంతో వారి ఆర్తనాదా లు వినడానికి ఎవరు అందు బాటులో లేకపోవడం వారి పాలిట యమపాశమైంది. ఉడుకు రక్తంతో కూడిన ఐదుగురు నవయువకు లు అతివేగం, పొగమంచు కారణాలకు తోడు నిలువెత్తు నిర్లక్ష్యం వెరసి ప్రాణాలను పణంగా పెట్టారు.
వివరాల్లోకి వెళితే…భూదాన్ పోచం పల్లి మండలం జలాల్‌పూర్ వద్ద కారు అర్ధరాత్రి సమయంలో అదు పుతప్పి చెరువులోకి దూసుకె ళ్లడంతో చోటుచేసుకున్న ఈ ఘటనలో కారు చెరువులో మునిగిపో వడం తో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు నిర్ధారించుకొని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరు కున్న పోలీసులు సహాయక చర్య లు చేపట్టారు.
ఈత రాకపోవడంతో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు చెబు తున్నారు. ఈ ఘటన ఉదయం తెల్లవారుజామున జరిగింది. హైద రాబాద్ హయత్ నగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన ఆరుగురు యువకు లు హర్ష, దినేశ్, వంశీ, బా లు, వినయ్, మణికంఠలు హైదరాబాదు నుండి వలిగొండలో పార్టీ చేసుకునేందుకు తెల్లవారుజామున హైద రాబాదు నుండి బయలుదే రారు. భూదాన్ పోచంపల్లి మండ లం జలాల్ పూర్ సమీపంలోకి రాగానే కారు అదుపుతప్పి చెరువు లోకి దూసుకెళ్లింది.
తెల్లవారుజామున ఫాగ్ ఉండడంతో పాటు చెరువు వద్ద మూల మ లుపు కూడా ఉండడంతో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకు పోయింది. యువకులు బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈ త రాకపోవ డంతో జలసమాదయ్యారు.ప్రమాద సమయంలో కారు లో ఆరుగురు యువకులు ఉన్నారు. అందులో ఈత వచ్చిన మణి కంఠ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఒడ్డుకు చేరుకున్న మణి కంఠ 100 కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు జలాల్ పూర్ గ్రామస్తు లు చెరువు నుండి కారుతోపాటు యువకుల మృతదేహాల ను వెలికి తీశారు.
అయితే మణికంఠను చికిత్స కోసం హైదరాబాద్ కు పోలీసులు తర లించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం భువనగిరి ఆసుపత్రికి తరలించారు. ఓవైపు పొగమంచు, మరోవైపు మలుపు. రెండు కలిసి ఐదుగురి ప్రాణం తీయగా రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీ వ్ర విషాదం నెలకొం ది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమో దు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు యువకు లు మృతి చెందడం తో ఐదు కుటుంబాల్లో విషాదం నెలకొంది. హైద రాబాద్ నుంచి పోచంపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారంఉదయం పొగమంచు, హైస్పీడ్‌తో పాటు ఇలాంటి మలుపు ఉండడం వల్ల యువకులు ఈ చెరువులోకి దూసుకెళ్లిపోయారు.
Road accident