Road Accident : ప్రజా దీవెన నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని మహి ళ మృతి చెందిన సంఘటన జరి గింది.
బయలుదేరుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కాలను లేదంటే రోడ్డు దాటాలనే ఆత్రుతలో సదరు మ హిళ కదులుతున్న బస్సు ముందు వైపు నుంచి పరుగెడు తున్న సమ యంలో బస్సు డ్రైవర్ కనిపెట్టలేక పోవడంతో రోడ్డు దాటే సమయం లో మహిళను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రాల కింద పడి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
మృతదేహాన్ని మోసుకెళ్ళిన పోలీసులు నారాయణపేట మం డలం సింగారం చౌరస్తాలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మహిళ మాణిక్యమ్మ మృత దేహాన్ని స్వయంగా పోలీసు లు మోసుకెళ్లి తమ వాహనంలో జి ల్లా ఆసుపత్రికి తీసుకెళ్ళారు. చిద్ర మైన మహిళ తల భాగాలను బట్ట లో వేసి తీసుకెళ్ళారు. ప్రజలు ఎవ రు ముందుకు రాకపోవడంతో పట్ట ణ ఎస్సైలు వెంకటేశ్వర్లు, రాము డు, కానిస్టేబుల్ భానుప్రకాష్ మృ తదేహాన్ని తీసుకెళ్ళారు. ప్రజలు శభాష్ పోలీసులు అంటూ ప్రశం సించారు.