Road accident : ప్రజా దీవెన, హైదరాబాద్: గోపాల పట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ర ఘు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు ద్వి చక్ర వాహనదారున్ని ఢీ కొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృ త్యువాత పడ్డాడు కొత్తపాలెం ఆద ర్శనగర్ కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీ 26 సంవత్సరాలు గుర్తిం చబడ్డాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసి షిప్ యార్డ్ లో అప్రెంటీస్ గా పనిచేస్తున్నాడు .
ఉమ్మి ఆదినారాయణ కార్పెంటర్ గా విధులు నిర్వహిస్తూ ఆయనకు ఇద్దరు కుమారులను ఉ న్నతమైన చదువులు చదివించా రు. తన పెద్ద కుమారుడు ఉమ్మి వే ణుగోపాలరావు డబ్ల్యూఎన్ఎస్ కం పెనీలో సత్యం కంప్యూటర్సలో పని చేస్తున్నాడు. తన సోదరుడును దింపటానికి ద్విచక్ర వాహనంపై వ చ్చి మృత్యువాత పడ్డాడు. ఈ వి షయం తెలుసుకున్న కుటుంబ స భ్యులు సంఘటన స్థలం వద్దకు వచ్చి బోరును విలపించారు. తన కుమారుడు చనిపోవడంతో తండ్రి ఆదినారాయణ ఏడుస్తూ అక్కడి కక్కడే కుప్పకూలిపోయాడు ఎంతో కష్టపడి కార్పెంటర్ పనులు చేస్తూ తన కుమారులని ఉన్నతమైన చ దువులు చదివిస్తూ వారిని ప్రయో జకులుగా తీర్చిదిద్దారు.
తండ్రికి ఆసరాగా ఉండవలసిన కొడుకు రోడ్డుపై శవంగా మారడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. సంఘటన స్థలం వద్దకు ట్రాఫిక్ సి ఐ శ్రీనివాసరావు ఎస్ ఐ లా అండ్ ఆర్డర్ ఎస్సై అప్ప లనాయుడు సంఘటన స్థలం వద్ద కు వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ బస్సును అదుపులోకి తీసు కున్నారు ట్రాఫిక్ సిబ్బంది సహా యంతో రోడ్డు ప్రమాదం గురైన వ్య క్తిని శవ పంచనామా కోసం కేజీ హె చ్ కు తరలించారు .