Road Accident : ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ ఔటర్ రింగురోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడి క్కడే దుర్మరణం పాలయ్యారు.ఔటర్ రింగ్ రోడ్డులోని మహేశ్వరం మండలం రావిర్యాల సమీపంలోని ఎగ్జిట్-13 వద్ద వేగంగా వస్తున్న బ్రేజా కారు వాటర్ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డా రు.
మరణించిన వారిలో వాటర్ ట్యాంకర్ హెల్పర్ గా గుర్తించారు. అదే విధంగా కారులో ప్రయాణిస్తు న్న మరొక వ్యక్తికి తీవ్రగాయాలు కా వడంతో ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనపై అధిభట్ల పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.