Road Accident: ప్రజాదీవెన, గద్వాల క్రైం: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala)జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత తనయుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మల్దకల్ మండలం మాజీ జెడ్పీటీసీ, మాజీ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు పటేల్ అరుణ ప్రభాకర్‌రెడ్డి (Former Congress DCC President Patel Aruna Prabhakar Reddy)కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. దయ్యలా వాగు దగ్గర కల్వర్ట్ ను అతడి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పటేల్ రామచంద్రారెడ్డికి (Ramachandra Reddy)(28) తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.