Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road Accident: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం, ఇరువురి దుర్మరణం

Road Accident: ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజా మున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే జాతీయ రహ దారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగిం ది. జాతీయ రహదారిపై సూర్యా పేట సమీపంలో సూర్యాపేట వద్ద రెండు ప్రైవేట్ బస్సుల్లో ముందు వెళ్తున్న బస్సును వెనకనుంచి మరో ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలవ్వగా ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సూర్యాపేట పోలీసులు.