ROAD ACCIDENT : ప్రజా దీవెన, నాగర్ కర్నూల్: నాగ ర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండ లం తుర్కల పల్లి సమీపంలో బుధ వారం కల్వకుర్తి నాగర్ కర్నూల్ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని హాస్పిటల్ కు తర లించారు.
మృతి చెందిన వ్యక్తులు బంగారయ్య (36), మహేష్ (35) కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.