*మరి ఒకరికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Road Accident: ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక గుడిబండ రోడ్డులో సోమవారం డీసీఎం (DCM) బైకు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరియొకరికి త్రీవర గాయాలు పరిస్థితి విషమం ఆయన సంఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గణపవరం గ్రామానికి చెందిన నేరేడు సైదులు 40 సంవత్సరాలు ప్రమాదంలో అక్కడకక్కడికి మృతిచెందగా గూడుపు పుల్లయ్య తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు బైక్ మీద ప్రయాణం చేస్తున్న ఇరువురు కోదాడ పట్టణంలో పని ముగించుకుని తన స్వగ్రామం గణపవరానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు.
ఈ క్రమంలో మేళ్లచెరువు వైపు నుండి కోదాడ వైపుకు వస్తున్న డీసీఎం (DCM) ఎదురుగా ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు పుల్లయ్యకు తీవ్ర గాయాలు (Severe injuries) కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు మృతునికి భార్య వీరకుమారి ఫిర్యాదు (complaint)మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై సైదులు తెలిపారు గుడిబండ రోడ్డులో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలలో రోడ్లకు విరువైపులా లారీలు ఆగి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రజలు అంటున్నాడు గుడిబండ రోడ్డుపై ప్రయాణం చేయటానికి వాహనదారులు భయపడుతున్నారు రోడ్డుకి ఇరువైపులా ఆపి ఉన్న లారీలను ఆపకుండా చర్యలు అధికారులు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు