Road Accident : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఆదివారం అద్దంకి నార్కట్ పల్లి బైపాస్ పై చింతపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాదు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పెళ్లి బస్సు ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొనడం తో ట్రాక్టర్ పై ఉన్న మహిళ అక్కడి కక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని మిర్యాలగూడలోని వర్షిత హాస్పిటల్ కు తరలించారు.
ప్రమా దం జరిగిన సందర్భంలో బస్సులో 36 మంది ఉన్నారు.ప్రమాదానికి అధిక వేగమే కారణమని తెలు స్తుంది. సంఘటన స్థలాన్ని పోలీ సులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.