పోలీసుల వేషoలో దారి దోపిడీ
ప్రజా దీవెన / రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో పోలీసులమని బెదిరించి దారిదోపిడి కి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పాండురంగ నగర్ లో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను అడ్డగించిన ఇద్దరుదుండగులు ఈ దోపిడీ కి పాల్పడ్డారు.
పోలీసులంమంటూ బలవంతంగా జోబులో ఉన్న 3 వేల నగదు, రెండు సెల్, ఫోన్లు తీసుకొని ఉడాయించారు. సదరు సంఘటన పై బాధితులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమేరకు విచారణ జరిపిన పోలీసులు దోపిడీ కి పాల్పడిన ఇద్దరు సర్దార్ జీలను వెంటనే అరెస్ట్ చేశారు అత్తాపూర్ పోలీసులు.