Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Road incidents spots: ప్రమాదాల నివారణకు ప్రణాళికలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు కారణభూతమైతున్న ప్రాంతాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా ప్రమా దాల నివారణకు చర్యలు తీసుకుం టామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపేర్కొన్నారు.

హైదరాబాద్, విజయవాడ హైవే పై 17 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
గుర్తించిన వెంటనే ఎప్పటికప్పుడు రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి
భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి
రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేం దుకు సత్వర చర్యలు
వచ్చే ఏడాదిలోగా సగానికి సగం ప్రమాదాలు నివారిస్తాం
రోడ్లు భవనాల శాఖ సమీక్ష సమా వేశంలోమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు(road incidents) కారణభూతమైతున్న ప్రాంతాలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా ప్రమా దాల నివారణకు చర్యలు తీసుకుం టామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati reddy venkat reddy) పేర్కొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారు లంతా అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటి కప్పుడు రోడ్లకు మరమ్మతు లు(road incidents) చేపట్టాలని ఆయన అధికారుల ను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవసర మైన చర్యలను వెంటనే చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వానాకాలంలో చోటు చేసుకునే రోడ్ల డ్యామేజీలకు(road damages) సంబంధించి అధికారులకు మంత్రి కోమటిరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం సచివాలయం లో రోడ్ల మరమ్మతులు(Road repairs), ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాల గురించి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ విజయేందిర బోయి, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతిరెడ్డి, జాతీయ రహ దాహదారుల ప్రాంతీయ అధికారి రజాక్, నేషనల్ హైవే, జిహెచ్ఎంసి కమిషనర్, జీహెచ్ఎంసి ఇంజనీ రింగ్ అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ఎన్హెచ్ఎఐ 65 రహదారిపై తరుచూ జరుగుతున్న రోడ్డు ప్రమా దాలకు కారణాలను ఈ సమావేశం లో మంత్రి కోమటిరెడ్డి అధికారుల తో చర్చించారు. రోడ్లపై లాగిన్ పా యింట్ల మరమ్మతుల గురించి మం త్రి అధికారులను అడిగి తెలుసుకు న్నారు.

ఈ సందర్భంగా హైవేలో(high ways) రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగు తున్న 17 బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డికి వివరించారు. చౌటు ప్పల్, పెదకా వర్తి, చిట్యాల, కట్టం గూర్, ఇనుపాముల, టేకుమట్ల, జనగామ క్రాస్ రోడ్డు, ఈనాడు జంక్షన్, దురాజ్పల్లి జంక్షన్, ముకుం దా పురం, ఆకుపాముల, కోమర బండ క్రాస్ రోడ్స్, కటకం గూడెం, మేళ్ల చెరువు, శ్రీరంగాపురం, రామా పురం క్రాస్ రోడ్లు, నవాబ్ పేట జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నట్లు అధికారులు మంత్రితో పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్యా మేజీ పనుల్లో వేగం పెంచాలన్నారు.

వానాకాలంలో ముందస్తు చర్యలపై ప్రజలకు సూచనలు చేయాలన్నా రు. పెండింగ్ ఫ్లైఓవర్లు నిర్మాణం, చిన్న వర్షానికి రోడ్లపై నిలుస్తున్న వరదలు, వాటిని ఎలా పరిష్కరిం చాలన్న దానిపై మంత్రి పలు సూ చనలు చేశారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సైన్ బోర్డ్స్, హెవీ స్పీడ్ నిర్మూలన, కొన్నిచోట్ల ఆరు లేన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించవచ్చని చెబుతూ వారికి సలహాలు, సూచ నలు చేశారు. కొన్నిచోట్ల రహదారు లు ఆరు లేన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, అండర్ పాస్లు, సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి వాటి కోసం ప్రణా ళికలు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మ కంగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు కు సంబంధించిన పనులను వేగవం తం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రాజెక్టును కేంద్రం 2021లో మంజూరు చేసిన ప్పటికి ఇప్పటికీ నిర్మాణం మొద లుకాకపోవడం వల్ల రాష్ట్రం అభి వృద్ధికి నోచుకోలేకపోయిందని మం త్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రీజినల్ రింగ్ రోడ్డును(regional ring road) ఉత్తర భాగానికి 161 కిలోమీటర్లు, దక్షిణ భాగానికి 190 కిలోమీటర్లు మొత్తంగా 351 కిలో మీటర్లుగా కేంద్రం మంజూరు చేసిం దని తెలిపారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ఉత్తర భాగం సంగా రెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి ప్రారంభమై చౌటుప్పల్ వద్ద 8 దక్షిణ భాగానికి కలుస్తుందని మంత్రి తెలి పారు.ఉత్తర భాగం నిర్మాణాన్ని ఆరు https://youtube.com/ప్యాకేజీలుగా విభ జించా మని, ఇప్పటికే దాదాపు 70 శాతం భూసే కరణ పూర్తయ్యిందని, మిగ తా 30 శాతం పురోగ తిలో ఉందని మంత్రికి అధికారులు వివరించారు. మిగిలిన ఈ 30 శాతంలో నర్సాపూ ర్ పరిధిలో ఆటవీశాఖకు సంబం ధించిన అంశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కొన్నిచోట్ల కోర్టు కేసు వివాదా లతో ఉన్న భూవివాదం కారణంగా భూసేకరణ ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు.

Road incidents spots in Telangana