ఘోర రోడ్డు ప్రమాదం, బీజాపుర్ రహదారిపై భీతావహo
ప్రజా దీవెన, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభ త్సం సృష్టించడంతో ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. హైదరాబాద్, బీజాపుర్ రహదారి వద్ద దాదాపు 50 మంది కూరగా యలు విక్రయిస్తుండగా ఒక్కసారిగా వారిపైకి లారీ దూసు కెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసు కుంది. దూసుకొస్తున్న లారీని గమ నించిన వ్యాపారులు భయంతో పరుగులు తీశారు.
వ్యాపారులపైకి దూసు కెళ్లి చెట్టును ఢీకొని లారీ ఆగిపోగా డ్రైవర్ మాత్రం క్యాబిన్లో ఇరుక్కు పోయాడు. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆ చెట్టు నేలకూలిం ది. ఈ ఘటనతో హైదరాబాద్- బీజాపుర్ రహ దారిపై భీతావహ వాతావ రణం నెలకొంది. హైదరా బాద్ నుంచి వెళ్తున్న ఈ లారీ సృ ష్టించిన బీభత్సంలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూ రు), సుజాత (ఖానాపూర్)గా గుర్తిం చారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగా త్రు లను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Roadaccident