బిగ్ బ్రేకింగ్, ఆగిఉన్న లారీని ఢీకొ ట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుR
RoadAccident: ప్రజా దీవెన అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి జందాపూర్ ఎక్స్ రోడ్ సమీపంలో చందాటీ బైపా స్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసు కుంది. ఆదివారం తెల్లవా రు జాము న 4.20 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రై వర్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలా బాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఒక ఐషర్ వ్యాన్ టైర్ ప్రమాదవశాత్తు పేలిపో యింది. అనంతరం ఆ వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం ఇండి కేషన్ లైట్లు కూడా ఆగిపో యాయి. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి జబల్పూర్ వెళ్తున్న కాంకర్ ట్రావె ల్స్ బస్సు వేగంగా దూసుకొచ్చి వ్యాన్‌ను ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్‌తో పాటు అందులోనే ఉన్న అదనపు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
మరో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయ పడ్డారు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరు కుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాల ను స్వాధీనం చేసు కుని, క్షతగా త్రులను ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.చాలా వరకు అందరు స్వల్ప గాయాలతో బయ టపడినట్లు వైద్యులు తెలిపారు.ఈ ప్రమా ద ఘటనపై కేసు నమోదు చే సుకున్న పోలీసులు దర్యాప్తు చేప ట్టారు.