ఘోర రోడ్డు ప్రమాదo, అక్కా చెల్లెళ్ళ దుర్మరణం
RoadAccident: ప్రజా దీవెన, వరంగల్: వరంగల్ జిల్లా ఖానా పురం మండలం కేంద్రం శివారులోని పెట్రోల్ పంపు సమీపంలో గురు వారం కారు బోల్తా పడి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క, చెల్లెలు మృ త్యువాత పడ్డారు. ఎస్ ఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం వరం గల్ జిల్లా ఖిలా వరంగల్‌కు చెందిన ఏసిరెడ్డి యశోద (80), బోలు గొడ్డు మాణిక్యమ్మ (78) మరో ముగ్గురు తమ కుటుంబ స భ్యులతో కలిసి కారులో మహబూబాబాద్ జిల్లా కొరివిలో తమ సమీప బంధు వు దశదినకర్మ వేడుకలకు హాజరయ్యారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి ఖిలా వరంగల్ కు వెళుతుం డగా ఖానాపురం శివారు పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే కారు వెనుక టైరు పేలి అదుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏసిరెడ్డి యశోద, బోలుగొడ్డు మాణిక్యమ్మ తీవ్రంగా గాయపడ్డారు. రమేష్ , హరీష్ అనితలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికు లు 108లో నర్సంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, అప్పటికే యశోద, మాణిక్యమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధా రించారు. ఒకే కుటుంబానికి చెం దిన అక్క, చెల్లెలు ఇద్దరు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.