బిగ్ బ్రేకింగ్, ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు దుర్మరణం
RoadAccident: ప్రజా దీవెన, ఖమ్మం: అశ్వారావు పేట-ఖమ్మం జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంతో నెత్తురోడ్డిం ది. ఆదివారం తెల్లవారుజాము నుండి వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ము గ్గురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మం డ లం ముష్టిబండ గ్రామ శివారులో రెండు లారీలు ఢీకొని ఒకరు మృ తి చెందగా, గంటల వ్యవధిలోనే రెండు కిలోమీటర్ల దూరంలోనే గాం ధీనగర్ గ్రామంలో మరో రోడ్డు ప్రమాదం జరిగి తల్లి కొడుకు మృతి చెందారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన తల్లి సరస్వతి (70), కొడుకు కృష్ణ (53) బంధువుల ఇంటికి వెళ్లి వ స్తుండగా గాంధీనగర్ గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వా హనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులకు సమా చారం అందించారు. ఖమ్మం- అశ్వారావుపేట జాతీయ రహదారి పై గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగి ముగ్గురు మరణించడం తో వాహన దా రులు ఆ రోడ్డుగుండా వెళ్లాలంటే భయపడుతున్నారు.