బిగ్ బ్రేకింగ్, బైకును ఢీకొన్న లారీ, ఒకరి దుర్మరణం
RoadAccident: ప్రజా దీవెన, గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.అతివేగంగా దూసుకొచ్చిన లారీ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయా లయ్యాయి. ఈ ప్రమాదం అహ్మదీ పూర్ సమీపంలో ఆది వారం ఉదయం చోటు చేసుకుంది.
గజ్వేల్ పట్టణ సమీపంలోని ఆర్అండ్ఆర్ కాలనీ బంజేరుపల్లి గ్రా మానికి చెందిన సుతారి కిష్ట య్య, సత్తమ్మ దంపతులు ఇద్దరు బైకు పై వెళ్తుండగా సిద్దిపేట నుండి గజ్వేల్ వైపు వస్తున్న లారీ అతివే గంగా వారిని ఢీకొట్టింది. సత్తవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. ప్ర మాదంలో భర్త కిష్టయ్య రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న కిష్టయ్యను 108 అంబులెన్స్‌లో గజ్వే ల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిష్టయ్యకు ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.